Hubli Violence : కర్ణాటకలో ఇంకా అల్లర్లు తగ్గడం లేదు. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ పై హుబ్లీలో జరిగిన హింసా కాండలో 40 మంది అరెస్ట్ అయ్యారు. ఈ ఘటనలో 12 మంది పోలీసులు గాయపడ్డారు.
ముస్లింలకు వ్యతిరేకంగా ఓ వ్యక్తి అభ్యంతకరమైన పోస్ట్ ను షేర చేశారు. దీంతో మరో వర్గం దాడికి పాల్పడింది. ఆదివారం ఉదయం హుబ్లీలో రాళ్ల దాడి ఘటన తర్వాత శాంతి భద్రతలను పరయవేక్షిస్తున్నారు.
ధావర్డ్ జిల్లాలోని పాత హుబ్లీ స్టేషన్ (Hubli Violence )పై ఓ గుంపు రాళ్లు రువ్వారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో 40 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు పోలీసులు. కొందరు చేసిన రాళ్ల దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
హుబ్లీ – ధార్వాడ్ పోలీస్ కమిషనర్ లాభూ రామ్ ప్రకారం ఓ వ్యక్తి ముస్లింల గురించి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టును షేర చేశారు. దీంతో హింస చోటు చేసుకుంది.
పలువురు ముస్లిం వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవడంలో ప్రజలు సంతృప్తి చెందలేదు. దీంతో పోలీస్ స్టేషన్ బయట ఆందోళనకు దిగినట్లు పోలీసులు తెలిపారు.
గుంపులో ఉన్న వ్యక్తులపై పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టేందుకు ప్రయత్నం చేశారు. ఎంతకూ వినక పోవడంతో టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. హింసకు పాల్పడిన వారిపై ఆరు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. ఈ ఘటనలో హుబ్లీలో 144 సెక్షన్ విధించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా పోలీసుల వాహనాలు దెబ్బ తిన్నాయి.
Also Read : కాషాయం దేశానికి అత్యంత ప్రమాదం