UP Election 2022 : ఉత్తర ప్రదేశ్ లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. భారీ ఎత్తున ఓటర్లు బారులు తీరారు. ప్రస్తుతం మూడు విడతలుగా పోలింగ్ ముగియగా నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది.
మొత్తం 59 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఇక అందరి దృష్టి ప్రధానంగా రైతుల ఘటనతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన లఖింపూర్ ఖేరిపై ఫోకస్ పడింది.
ఇవాళ లక్నోలో బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ కుమారి మాయావతి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవాళ పిలిభిత్ , లఖింపూర్ ఖేరి, సీతాపూర్ , ఉన్నావ్ , లక్నో, రాయ్ బరేలీ, బందా, ఫేతేపూర్ జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలకు (UP Election 2022)పోలింగ్ జరుగుతోంది.
సోనియా గాంధీకి కంచుకోటగా ఉన్న రాయ్ బరేలి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఇక 2017లో బీజేపీ 51 సీట్లు గెలుచుకోగా నాలుగు సమాజ్ వాది పార్టీ, రెండు కాంగ్రెస్ , రెండు బీఎస్పీ చేజిక్కించుకున్నాయి.
బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న అప్నా దళ్ పార్టీ ఒక సీటులో విజయం సాధించింది. లఖింపూర్ ఖేరిలో రైతుల ఘటనలో కీలక నిందితుడిగా ఉన్నాడు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా. ఆయన ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు.
దీనిని సవాల్ చేస్తూ రైతులు కోర్టుకు ఎక్కారు. ప్రస్తుతం బీజేపీ నుంచి యోగేష్ వర్మ, ఎస్పీ నుంచి ఉత్కర్ష్ వర్మ, కాంగ్రెస్ నుంచి రవిశంకర్ త్రివేది ఉన్నారు.
మహిళా ఓటర్ల కోసం 137 బూత్ లను ఏర్పాటు చేశారు. ఇక మిగిలిన మూడు దశల ఎన్నికలు ఫిబ్రవరి 27, మార్చి 3, 7 తేదీల్లో కొనసాగుతోంది. మార్చి 10న రిజల్ట్స్ వస్తాయి.
Also Read : ఎంపీల పనితీరుకు ‘సంసద్’ పురస్కారం