Jahangirpuri Violence : ఢిల్లీ హింసాకాండ‌లో ఐదుగురిపై ‘నాసా’

24 మంది అరెస్ట్..బాల నేర‌స్థులు కూడా

Jahangirpuri Violence : దేశ రాజ‌ధాని ఢిల్లీలో శ్రీ‌రామ‌న‌వమి సంద‌ర్బంగా నిర్వ‌హించిన ఊరేగింపులో ఇరువ‌ర్గాల మ‌ధ్య చోటు చేసుకున్న ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు స్పీడ్ పెంచారు. ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

ఇప్ప‌టికే ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ఢిల్లీ పోలీస్ క‌మిష‌న‌ర్ అస్థానా. హింసాకాండ‌కు కార‌ణంగా భావిస్తున్న ఐదుగురు నిందితుల‌పై జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టం ( నాసా ) కింద అభియోగాలు మోపారు.

ఒక వ్య‌క్తిని ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేదా అధికారికంగా చెప్ప‌కుండానే నెల‌ల త‌ర‌బ‌డి నిర్బంధించేందుకు ప్ర‌భుత్వానికి అధికారం ఉంటుంది.

ఇదే నాసా చ‌ట్టం. ఈ చ‌ట్టం ఉగ్ర‌వాదానికి ఊతం ఇచ్చే వారిని, దేశంలో అల్ల‌క‌ల్లోలం సృష్టించే వారికి, సంఘ విద్రోహ శ‌క్తుల ఆట క‌ట్టించేందుకు ఈ చ‌ట్టాన్ని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు.

ఇది అత్యంత క‌ఠిన‌త‌ర‌మైన ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ట్టంగా పేర్కొన వ‌చ్చు. ఇదిలా ఉండ‌గా శ‌నివారం సాయంత్రం ఢిల్లీలోని జ‌హంగీర్ పురిలో హ‌నుమాన్ జ‌యంతి ఊరేగింపు సంద‌ర్భంగా ఘ‌ర్ష‌ణ‌లు(Jahangirpuri Violence) చెల‌రేగాయి.

ఎన్ఎస్ఏ కింద అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో ప్ర‌ధాన నిందితుడు అన్సార్ కూడా ఉన్నాడు. మిగ‌తా వారిలో స‌లీం, ఇమామ్ షేక్ లేదా సోను, దిల్షాద్, అహిర్ అని పోలీసులు ప్ర‌క‌టించారు.

వీరిపై నాసా చ‌ట్టాన్ని ఉప‌యోగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సీరియ‌స్ అయ్యారు.

ఢిల్లీ పోలీస్ క‌మిష‌న‌ర్ అస్థానాను క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఇప్ప‌టి దాకా ముగ్గురు చిన్నారుల‌తో స‌హా 24 మందిని అరెస్ట్ చేశారు.

Also Read : బీజేపీపై శివ‌సేన ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!