Sunil Bharti Mittal : 2024 నాటికి దేశమంతటా 5జీ సేవలు
ప్రకటించిన భారతీ ఎయిర్ టెల్ చైర్మన్
Sunil Bharti Mittal : భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్(Sunil Bharti Mittal) సంచలన ప్రకటన చేశారు. శనివారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ప్రగతి మైదానంలో మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఈ సందర్భంగా మోదీ 5జీ సర్వీసెస్ ను ప్రారంభించారు.
ఆయా దిగ్గజ టెలికాం సంస్థలు మొబైల్ కాంగ్రెస్ లో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. 5జీ టెక్నాలజీ గురించి వివరించారు. ఇందులో భాగంగా భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ మాట్లాడారు. 5జీ సర్వీసులను 2024 నాటికి దేశ వ్యాప్తంగా విస్తరించేలా చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి టెస్టింగ్ కూడా పూర్తయిందని 8 నగరాల్లో ప్రారంభించామన్నారు.
ఇవాళ అక్టోబర్ 1న చరిత్రాత్మకమైన రోజుగా నిలిచి పోతుందన్నారు సునీల్ భారతీ మిట్టల్. నాలుగు మెట్రోలతో పాటు మొత్తం ఎనిమిది నగరాలలో 5జీ టెలికాం సేవలను ప్రారంభిస్తోందన్నారు. మార్చి 2024 నాటికి దేశం మొత్తాన్ని క్రమంగా కవర్ చేస్తూ వెళతామని స్పష్టం చేశారు. ప్రగతి మైదాన్ లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ను ఉద్దేశించి ఎయిర్ టెల్ చైర్మన్ ప్రసంగించారు.
తన అనుభవాలను పంచుకున్నారు. అత్యంత ముఖ్యమైన రోజు. కొత్త శకం ప్రారంభం కానుంది. ఈ ప్రారంభం స్వాతంత్రం వచ్చి 75వ సంవత్సరంలో జరగడం మామూలు విషయం కాదన్నారు భారతీ మిట్టల్. దేశంలో కొత్త అవగాహన, శక్తిని ప్రారంభించనుందన్నారు. 5జీ టెక్నాలజీ ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.
Also Read : రష్యాపై ఓటింగ్ లో భారత్ గైర్హాజరు