PM Modi Rozgar Mela : రోజ్ గార్ మేళా ద్వారా 71 వేల జాబ్స్
లేఖలు పంపిణీ చేయనున్న ప్రధానమంత్రి
PM Modi Rozgar Mela : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోజ్ గార్ మేళా కింద 71,000 ఉద్యోగ లేఖలను పంపిణీ చేయనున్నారు. శుక్రవారం దీనికి శ్రీకారం చుట్టనున్నారు. గత ఏడాది 2022 అక్టోబర్ లో ధన్ తేరస్ సందర్భంగా నరేంద్ర మోదీ రోజ్ గార్ మేళా పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఇది 10 లక్షల ప్రభుత్వ కొలువులను సృష్టించే ప్రచారానికి నాంది పలికింది.
ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉపాధి కోసం రోజ్ గార్ మేళా(PM Modi Rozgar Mela) పథకం కింద దాదాపు 71 వేల మందికి పైగా అపాయింట్ మెంట్ లెటర్లను ప్రధాన మంత్రి పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కేంద్ర కార్యాలయం గురువారం తెలిపింది.
రోజ్ గార్ మేళా కింద కొత్తగా రిక్రూట్ లు జూనియర్ ఇంజనీర్లు , లోకోమోటివ్ డ్రైవర్లు, టెక్నీషియన్లు, పోలీస్ ఇన్స్ పెక్టర్లు, సబ్ ఇన్స్ పెక్టర్లు, కానిస్టేబుళ్లు, స్టెనో గ్రాఫర్లు, ఆదాయపు పన్ను శాఖలో, వివిధ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్య, ఆరోగ్య సంబంధిత విభాగాలతో సహా వివిధ రకాల ఉద్యోగాలు లేదా పోస్ట్ లలో పని చేయనున్నారు.
వీరితో పాటు వ్యక్తిగత సహాయకులుగా కూడా పని చేయనున్నారు. గత ఏడాది నియామకాల మొదటి విడతలో 75,000 మందికి పైగా జాబ్స్ ఇచ్చారు.
అంతే కాకుండా అదే ఏడాది నవంబర్ లో 71 వేల మందికి జాబ్స్ కు సంబంధించిన లేఖలు అందజేశారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఇదిలా ఉండగా రోజ్ గార్ మేళా ప్రారంభించినప్పటి నుండి పీఎం గుజరాత్ , జమ్ము కాశ్మీర్ , మహారాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించారు.
Also Read : ఉద్యోగులను ఉబెర్ తొలగించనుందా