UP Election 2022 : యూపీలో బారులు తీరిన ఓట‌ర్లు

ఏడో విడుత పోలింగ్ ప్రారంభం

UP Election 2022 : నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు (UP Election 2022 )సంబంధించి చివ‌రి అంకానికి ఇవాల్టితో తెర ప‌డ‌నుంది. ఇప్ప‌టి దాకా మొత్తం 403 సీట్ల‌కు గాను ఆరు విడుత‌ల పోలింగ్ ముగిసింది.

ఏడో విడ‌త పోలింగ్ ప్రారంభ‌మైంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ చేప‌ట్టింది. క‌రోనా కార‌ణంగా ర్యాలీలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు నిషేధించింది.

అంతే కాకుండా ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాల‌తో పాటు స‌ర్వే సంస్థ‌లు ముంద‌స్తుగా ఓపినీయ‌న్ పోల్స్ చేప‌ట్ట‌వ‌ద్దంటూ ఆదేశించింది.

ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీతో పాటు స‌మాజ్ వాది పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ , ఆర్ఎల్డీ, ఆప్ తో పాటు ఇత‌ర పార్టీలు, ఇండిపెండెంట్లు పెద్ద ఎత్తున బ‌రిలో ఉన్నారు.

ఇక పోలింగ్ విష‌యానికి వ‌స్తే ఓట‌ర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు. ప‌వ‌ర్ లో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ఈసారి స‌మాజ్ వాది పార్టీతో తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది.

అజామ్ గ‌ఢ్ , మౌ, జాన్ పూర్ , ఘాజీపూర్ , చందౌలి, వార‌ణాసి, మీర్జాపూర్ , భ‌దోయి, సోన్ భ‌ద్రా జిల్లాల్లో పోలింగ్ కొన‌సాగుతోంది. రాష్ట్రానికి చెందిన మంత్రులు నీల కాంత్ తివారి, రాజ్ భ‌ర్ , ర‌వీంద్ర జైస్వాల్ , గిరీష్ యాద‌వ్ , ర‌మా శంక‌ర్ సింగ్ బ‌రిలో ఉన్నారు.

ఇక దేశ ప్ర‌ధాని న‌రంద్ర మోదీ వార‌ణాసి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇక్క‌డ ఆయ‌న ఎక్కువ‌గా ప‌ర్య‌టించ‌డం విశేషం.

Also Read : సీఐఎస్ఎఫ్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం

Leave A Reply

Your Email Id will not be published!