8th Pay Commission : కేంద్ర బడ్జెట్ కు ముందే ఉద్యోగులకు తీపికబురు

ఇప్పుడు హఠాత్తుగా 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది...

8th Pay Commission : బడ్జెట్‌కు ముందే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్ చెప్పింది. గురువారం జరిగిన కేబినెట్ భేటీలో 8వ వేతన సంఘం(8th Pay Commission) ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం 53 శాతానికి పెరిగిన తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 8వ వేతన సంఘం ఎప్పుడు వేస్తారా.. అని కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. కొత్త వేతన సంఘం అమలుకు సంబంధించి పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినప్పుడల్లా ప్రభుత్వం అలాంటి ప్రతిపాదనలేమీ లేవని చెబుతూ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు హఠాత్తుగా 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

8th Pay Commission Updates..

గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇందులో ప్రధానంగా కొత్త వేతన సంఘం ఏర్పాటుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. కమిషన్ చైర్మన్‌ను త్వరలోనే నియమిస్తామన్నారు. ఈ కమిషన్ వచ్చే ఏడాది అంటే 2026 నాటికి తన నివేదికను సమర్పిస్తుందని తెలిపారు.

పే కమీషన్‌ చరిత్రను పరిశీలిస్తే.. 7వ వేతన సంఘం కంటే ముందు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 4వ, 5వ, 6వ వేతన కమీషన్‌ల కాలవ్యవధి సమానంగా 10 సంవత్సరాలు ఉండేది. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం.. 2016లో అమల్లోకి వచ్చింది. 2025 డిసెంబర్‌తో 10 సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే ఈ గడువు కంటే ముందే.. ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

8వ వేతన సంఘం(8th Pay Commission) అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కనీసం 2.86గా నిర్ణయించే అవకాశం ఉంటుందట. ఇదే జరిగితే, ఉద్యోగుల కనీస బేసిక్ జీతంలో పెరుగుదల భారీగా ఉంటుంది. అంటే మినిమం.. రూ.51,480 ఉండొచ్చు. ప్రస్తుతం కనీస మూల వేతనం రూ.18,000 ఉంది.దీంతో పాటు.. పెన్షనర్లు కూడా అదే ప్రయోజనం పొందనున్నారు. పెన్షనర్ల కనీస పెన్షన్ ప్రస్తుతం ఉన్న రూ.9,000 నుండి రూ.25,740కి పెరిగే ఛాన్స్ ఉంది.కేంద్ర ఉద్యోగుల వేతనాన్ని నిర్ణయించడంలో ఈ ఫిట్‌మెంట్ అంశం కీలక పాత్ర పోషిస్తుండడం గమనార్హం. 7వ వేతన సంఘం లెక్కలను పరిశీలిస్తే, ఉద్యోగులకు అందే అన్ని అలవెన్సులు కాకుండా బేసిక్ జీతం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా వారికి అందే మొత్తం జీతం నిర్ణయించబడుతుంది.

2016 జనవరి నుంచి నరేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వం 6వ వేతన సంఘం సిఫార్సులకు బదులు 7వ వేతన సంఘం సిఫార్సులను అమలులోకి తెచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం కింద 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వర్తించబడింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ శాలరీ 2.57తో గుణించబడుతుంది. ఇది ఉద్యోగుల ప్రాథమిక వేతనంలో 2.57% పెరుగుదలకు సమానం. మునుపటి పే కమిషన్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.86. ఇది ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనంలో 1.86% పెరుగుదల ఉంది.

Also Read : Central Cabinet Meeting : కేంద్ర క్యాబినెట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలలివే

Leave A Reply

Your Email Id will not be published!