Irfan Pathan : బీసీసీఐ సెలెక్ట‌ర్ల‌పై ప‌ఠాన్ పంచులు

ఆటగాళ్ల‌కు రెస్ట్ ఇస్తే రాణిస్తారా

Irfan Pathan : విండీస్ తో ఆడే భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ సెలెక్ట‌ర్ల తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్. విచిత్రం ఏమిటంటే వ‌న్డే జ‌ట్టుకు కెప్టెన్ గా వెట‌రన్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ గా ఎంపిక చేసింది.

ఇదే స‌మ‌యంలో సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, జ‌స్ప్రీత్ బుమ్రా, రిష‌బ్ పంత్ , ష‌మీల‌కు విశ్రాంతి ఇవ్వ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

అస‌లు సెలెక్ట‌ర్లు ఏం చేస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో తెలియ‌డం లేద‌ని పేర్కొన్నాడు. ట్విట్ట‌ర్ వేదిక‌గా గురువారం తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు.

ఇప్ప‌టికే ఫామ్ కోల్పోయి నానా తంటాలు ప‌డుతున్న రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌ను ఎందుకు ప‌క్క‌న పెట్టారంటూ ప్ర‌శ్నించాడు. విశ్రాంతి ఇవ్వ‌డం వ‌ల్ల బాగా ఆడుతార‌ని అనుకోవ‌డం వేస్ట్ అని ఫైర్ అయ్యాడు ప‌ఠాన్.

ఒక ర‌కంగా సెలెక్ట‌ర్ల‌పై పంచులు విసిరాడు. భార‌త జ‌ట్టుకు గ‌తంలో లేని విధంగా ఐపీఎల్ పుణ్య‌మా అని పెద్ద ఎత్తున పోటీ ఏర్ప‌డింది. రెస్ట్ తీసుకున్న ఏ ఆట‌గాడు రాణించిన దాఖ‌లాలు లేవ‌ని పేర్కొన్నాడు ఇర్ఫాన్ ప‌ఠాన్(Irfan Pathan).

తాజాగా మాజీ క్రికెట‌ర్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. క్రీడా వ‌ర్గాల‌లో చ‌ర్చ‌కు దారి తీసింది. త‌రుచూ సెలెక్ట‌ర్లు కెప్టెన్లు మారుస్తూ జ‌ట్టు భ‌విష్య‌త్తును నాశ‌నం చేస్తున్నారంటూ మండి ప‌డుతున్నారు మాజీ క్రికెట‌ర్లు.

ఒక్క నెల‌లో ఒకే జ‌ట్టుకు న‌లుగురు సార‌థులుగా ఉండ‌డం ప్ర‌పంచంలో ఎక్క‌డా జ‌ర‌గ‌లేద‌న్నారు.

Also Read : రాణిస్తేనే కోహ్లీకి చాన్స్ లేదంటే క‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!