Sri Lanka Army Chief : ప్లీజ్ సంయ‌మ‌నం పాటించండి

శ్రీ‌లంక ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ శ‌వేంద్ర సిల్వా

Sri Lanka Army Chief : శ్రీ‌లంకలో ఆర్థిక‌, ఆహార‌, ఆయిల్ సంక్షోభంతో అట్టుడుకుతోంది. ఇప్ప‌టికే ల‌క్ష‌లాది జ‌నం రోడ్ల‌పైకి వ‌చ్చారు. అధ్య‌క్షుడు గోట‌బోయ రాజ‌ప‌క్సే భ‌వ‌నంపై దాడి చేశారు. లోప‌ల‌కు చొచ్చుకు పోయారు.

అక్క‌డి నుంచి ప్ర‌స్తుత ప్ర‌ధాన మంత్రిగా ఇటీవ‌లే కొలువు తీరిన ర‌ణిలే విక్ర‌మ సింఘే ఇంటికి నిప్ప‌టించారు. ఆయ‌న‌కు చెందిన వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు. దీంతో తాను కూడా పీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇదే స‌మ‌యంలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన‌డంతో తాను ఈనెల 13న ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తాన‌ని స్పీక‌ర్ కు తెలియ చేశారు. ఇదే స‌మ‌యంలో అధ్య‌క్ష భ‌వనం నుంచి పారి పోయాడు.

అక్క‌డి నుంచి సామాన్లు, నోట్ల క‌ట్ట‌ల‌తో ప‌డ‌వ‌లో ప‌లాయ‌నం చిత్త‌గించాడు. అఖిల‌ప‌క్షం కొత్త‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసంత వ‌ర‌కు తాను కొన‌సాగుతాన‌ని, స‌హ‌కారం అంద‌జేస్తాన‌ని చెప్పారు.

ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హావేశాల‌తో ఉన్న ప్ర‌జ‌లు శాంతంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు శ్రీ‌లంక ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ శవేంద్ర సిల్వా. ఆదివారం ఆయ‌న జాతీయ, అంత‌ర్జాతీయ మీడియాతో మాట్లాడారు.

ప్ర‌స్తుత సంక్షోభాన్ని శాంతియుత ప‌ద్ద‌తిలో ప‌రిస్క‌రించేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌న్నారు. సంయ‌మ‌నం పాటించాల‌ని, శాంతి ఏర్పాటుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు ఆర్మీ చీఫ్‌(Sri Lanka Army Chief) .

ఈ సంద‌ర్భంగా సాయుధ బ‌ల‌గాలు, పోలీసుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడేందుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఇదే స‌మ‌యంలో ఐఎంఎఫ్ సంక్షోభం నుంచి గ‌ట్టెక్కేందుకు స‌హ‌క‌రించేలా చూస్తామ‌ని తెలిపింది.

ప్ర‌జ‌ల అసంతృప్తిని ప‌రిష్క‌రించేందుకు దీర్ఘ‌కాలిక ప‌రిష్కారాల‌ను సాధించేందుకు ముందుకు రావాల‌ని అమెరికా కోరింది. జ‌ర్న‌లిస్టుల‌పై దాడులు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read : శ్రీ‌లంక‌ పీఎం విక్ర‌మ సింఘే రాజీనామా

Leave A Reply

Your Email Id will not be published!