Heavy Rains India : ప్ర‌కృతి ప్ర‌కోపం వ‌ర్ష బీభ‌త్సం

మ‌రాఠా,,తెలంగాణ..క‌ర్ణాట‌క‌లో అల‌ర్ట్

Heavy Rains India : నైరుతి రుతు ప‌వ‌నాల దెబ్బ‌కు దేశంలోని ప‌లు రాష్ట్రాల‌లో భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంక‌లు పొంగి పొర్లి ప్ర‌వ‌హిస్తున్నాయి. న‌దుల‌న్నీ ప్ర‌మాద స్థాయికి ద‌గ్గ‌ర‌గా ప్ర‌వ‌హిస్తున్నాయి.

ప్ర‌ధానంగా మ‌హారాష్ట్ర‌, తెలంగాణ‌లలో వాన‌లు దంచి(Heavy Rains India) కొడుతున్నాయి. నిర్మ‌ల్ జిల్లా అత‌లాకుత‌ల‌మైంది. భైంసా ప‌ట్ట‌ణం నీళ్ల‌లోనే నిలిచి పోయింది. అస్సాంలో వ‌ర‌ద ఉధృతి అలాగే ఉంది.

సూర‌త్ లో వ‌ర్షం దెబ్బ‌కు నీళ్ల‌లోనే న‌డిచి వెళుతున్నారు. ఇక మ‌హారాష్ట్ర‌లో 130 గ్రామాలు నీళ్ల‌లో చిక్కుకున్నాయి. 128 గ్రామాల‌కు ప్ర‌పంచంతో సంబంధాలు పూర్తిగా తెగి పోయాయి.

క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లో రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ప‌శ్చిమ తీరం వెంట రుతు ప‌వ‌నాలు చురుకుగా ఉండ‌డంతో వ‌ర్షాలు భారీగా ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది.

కోస్తా ఆంధ్ర ప్ర‌దేశ్ , గుజ‌రాత్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీగా వ‌ర్షాలు ప‌డ్డాయి గ‌త రాత్రి. ఇక దేశంలోని ఉత్త‌రాఖండ్ , తూర్పు ఉత్త‌ర ప్ర‌దేశ్ , ఒడిశా, గోవా, మ‌రఠ్వాడా, సెంట్ర‌ల్ మ‌హారాష్ట్ర‌, ఛ‌త్తీస్ గ‌ఢ్ , మ‌ధ్య ప్ర‌దేశ్ , కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌ల‌లో వాన‌లు దంచి కొడుతున్నాయి.

చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ఇక పంజాబ్ , హ‌ర్యానా, యూపీలో(Heavy Rains India) ఆదివారం మ‌రిన్ని వ‌ర్షాలు కురుస్తాయ‌ని స‌మాచారం. గడ్చిరోలి తో పాటు హింగోళి, నాందేడ్ జిల్లాలు భారీ వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్నాయి.

ఇక తెలంగాణ‌లోని జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, నిజామాబాద్ , రాజ‌న్న సిరిసిల్ల‌, నిర్మ‌ల్ జిల్లాల‌ను వ‌ర్షం ముంచెత్తింది. దీంతో రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

అస్సాంలో 6, 27, 874 మంది ప్ర‌జ‌లు వ‌ర్షాల‌కు ఇబ్బందులు ప‌డుతున్నారు. క్షేత్రం స‌మీపంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read : జోరు వాన త‌డిసి ముద్దైన తెలంగాణ

Leave A Reply

Your Email Id will not be published!