Gotabaya Rajapaksa : శ్రీలం అధ్యక్షుడి కోసం గాలింపు
అధ్యక్షుడి భవనంలో నిరసనకారులు
Gotabaya Rajapaksa : శ్రీలంకలో సంక్షోభం ఇంకా ముగియలేదు. నిరసనకారులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. అధ్యక్షుడి గోటబోయ రాజపక్సే(Gotabaya Rajapaksa), పీఎం రణిలే విక్రమ సింఘే నివాసాల్లోనే ఉన్నారు.
పరిస్థితిని కంట్రోల్ చేయలేక ఆర్మీ, బలగాలు చేతులెత్తేశాయి. ఈ సందర్భంగా సంయమనం పాటించాలని శ్రీలంక ఆర్మీ చీఫ్ పిలుపునిచ్చారు.
ప్రస్తుతం దేశానికి సంబంధించి పార్లమెంట్ స్పీకర్ మహీంధా యాపా అబేవర్దనే అందుబాటులో ఉన్నారు. ఆయనే ఇప్పుడు దేశానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. పీఎం ఇంటికి నిప్పు పెట్టడంతో రణిలె విక్రమ సింఘే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆందోళనకారులు ఆదివారం కూడా రాజపక్సే, విక్రమ సింఘే నివాసాలను ఆక్రమించడం కొనసాగించారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి మీరే కారణం అంటూ భవనాలలో ఒక దానికి నిప్పంటించారు.
దేశాధ్యక్షుడు గోటబయ ఎక్కడ ఉన్నాడనేది ఇంకా తెలియడం లేదు. ఆయన ఆచూకీ కోసం ప్రపంచం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ఇదిలా ఉండగా అధ్యక్షుడు గోటబోయ బుధవారం తన పదవికి రాజీనామా చేస్తారంటూ స్పీకర్ ప్రకటించారు.
అఖిలపక్ష నేతల సమావేశం తర్వాత రాజీనామా చేయాలని కోరుతూ అబేవర్దన తనకు లేఖ రాశారు. దీంతో గత్యంతరం లేక తప్పుకుంటున్నట్లు తెలిపారు గోటబోయ రాజపక్సే.
రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ఇద్దరూ లేనప్పుడు స్పీకర్ తాత్కాలిక రాష్ట్రపతిగా ఉంటారు. ఇదే సమయంలో శాంతి, సుస్థిరతలను కాపాడేందుకు భద్రతా బలగాలకు ప్రజలంతా సహకరించాలని కోరారు ఆర్మీ చీఫ్ శవేంద్ర సిల్వా.
ఇదిలా ఉండగా శ్రీలంక సైన్యం జరిపిన దాడుల్లో 102 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో టెలివిజన్ జర్నలిస్టులు ఉన్నారు.
Also Read : సోదరుల నిర్వాకం శ్రీలంక సర్వ నాశనం