Eknath Shinde : చక్రం తిప్పుతున్న ఏక్ నాథ్ షిండే
40 మంది కార్పొరేటర్లు సీఎంకు సంపూర్ణ సపోర్ట్
Eknath Shinde : తమదే అసలైన శివసేన పార్టీ అని ప్రకటించిన సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) రోజు రోజుకు తన బలాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీని వీడారు.
వారిపై వేటు వేయాలని కోరుతూ శివసేన పార్టీ సుప్రీంకోర్టులో దావా దాఖలు చేసింది. ఈనెల 12 వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అంతే కాకుండా ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఆయా ప్రభుత్వాలే కీలకమైన పాత్ర పోషిస్తాయని పేర్కొంది. ఈ తరుణంలో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు.
త్వరలోనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ముంబైతో పాటు పక్కనే ఉన్న థానేలో ఏక్ నాథ్ షిండే(Eknath Shinde)కు మంచి పట్టుంది.
ప్రధానంగా ఆయన ఏం చెబితే అదే వేదం. ఇక సీఎంగా కొలువు తీరాక మరింత పట్టు పెంచుకునేందుకు ప్రయత్నం చేశారు. తాజాగా శివసేన పార్టీకి కళ్యాణ్ డోంబివిలిలో ఎదురు దెబ్బ తగిలింది.
శివసేన పదాధికారులతో పాటు 40 మంది కార్పొరేటర్లు షిండే నివాస స్థలం నందనవనానికి వెళ్లి తమ మద్దతు ప్రకటించారు. త్వరలోనే ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.
వీరంతా చేరడం వెనుక సీఎం తనయుడు, ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాంత్ షిండే హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా వీరు చేరుతున్న విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు సీఎం షిండే, కొడుకు శ్రీకాంత్.
Also Read : సీఎం సుప్రీం షిండే మాటే వేదం