Etela Rajender & KCR : కేసీఆర్ పై పోటీకి సిద్ధం ఓటమి ఖాయం
ఎక్కడ నిలబడినా చుక్కలు చూపిస్తా
Etela Rajender & KCR : భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
సోయి తప్పి మాట్లాడుతున్న కేసీఆర్ కు తాను జీవితంలో గుర్తుంచుకునేలా చేస్తానని చెప్పారు. ఈటల రాజేందర్ మీడియా తో మాట్లాడారు.
ఆయన రాష్ట్రంలో ఎక్కడ నిలబడినా పోటీకి దిగేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే తన చేతిలో ఓడి పోవడం మాత్రం ఖాయమని జోస్యం చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా దూషించడంపై మండిపడ్డారు. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన వ్యక్తులకు గౌరవం ఇవ్వక పోవడం కేసీఆర్ కు పరిపాటిగా మారిందన్నారు.
ఆయనకు ప్రజాస్వామ్యం పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ ఏనాడూ గౌరవం లేదన్నారు. తనంతకు తాను నియంతగా భావిస్తున్నాడని, కానీ చరిత్రలో ఏ ఒక్కరు జనాన్ని జయించిన నాయకుడు లేడన్నారు.
ప్రజలే ప్రభువులు వారే చరిత్ర నిర్మాతలు అన్నది గుర్తు పెట్టుకోవాలని కేసీఆర్ కు ఈటల రాజేందర్(Etela Rajender & KCR) సూచించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడిన వారంతా కాల గర్భంలో కలిసి పోయారని గుర్తు చేశారు.
తాజాగా శ్రీలంక ప్రెసిడెంట్ ఏకంగా రాజ భవనం విడిచి పెట్టి పారి పోయాడని సేమ్ సీన్ నీకు కూడా త్వరలో జరుగుతుందన్నారు. ప్రగతి భవన్ నుంచి తరిమి కొట్టే రోజు తప్పకుండా వస్తుందన్నారు రాజేందర్.
కేసీఆర్ ను ఢీకొనే దమ్ము తనకు ఉందని ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారన్నారు. గజ్వేల్ లో సీఎంను బొంద పెట్టేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. ఖలేజా ఉంటే అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈటల.
Also Read : ద్రౌపది ముర్ము తెలంగాణ టూర్ రద్దు