Raghav Chadha : రాఘవ్ చద్దాజీ జీతే రహో – సీఎం
రాష్ట్ర అడ్వయిజరీ బోర్డు చైర్మన్ గా ఎంపిక
Raghav Chadha : రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి అధికార ప్రతినిధి. అంతే కాదు పంజాబ్ రాష్ట్రానికి అడ్వయిజరీ బోర్డుకు చైర్మన్ గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా తాజాగా తనను నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ను కలిశాడు.
ఈ సందర్భంగా ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తో పాటు రాఘవ్ చద్దా(Raghav Chadha) రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
మోస్ట్ పాపులర్ లీడర్ గా ఆయన పేరొందారు ఆప్ లో. అంతకు ముందు ఢిల్లీ లోని రాజిందర్ నగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్ గా కూడా పని చేశారు.
11 నవంబర్ 1988లో పుట్టాడు రాఘవ్ చద్దా. ఆయన ప్రస్తుత వయస్సు 33 ఏళ్లు. అల్మా మేటర్ యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీలో చదివాడు. ఇన్సిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చదివాడు.
వృత్తి రీత్యా సీఏగా పేరొందాడు రాఘవ్ చద్దా. పలు కంపెనీలకు సీఏగా పని చేశాడు. ఢిల్లీ యూనివర్శిటీలో పీజీ చేశాడు. ఈఎంబీఏ కోసం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివేందుకు వెళ్లాడు.
తన కెరీర్ స్టార్ట్ లో డెలాయిట్ , శ్యామ్ మల్పానీ, గ్రాంట్ థోర్నటన్ తో సహా అకౌంటెన్సీ సంస్థలతో కలిసి పని చేశాడు రాఘవ్ చద్దా. 2015లో ఆప్ తరపున అసెంబ్లీ బరిలో నిలిచి గెలిచాడు.
ఆప్ జాతీయ కోశాధికారిగా 26 ఏళ్ల వయస్సులో చేశాడు. 2020లో జరిగిన ఢిల్లీలోని రాజిందర్ నగర్ లో గెలిచాడు రాఘవ్ చద్దా. ప్రస్తుతం అడ్వయిజరీ బోర్డు చైర్మన్ గా ఎంపికయ్యాడు.
Also Read : అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గా రాఘవ్ చద్దా
Mann Sahib has honoured me with an opportunity to do ‘Sewa’ of the people of Punjab. I sought his blessings as I begin my new role. Will give my blood, sweat, tears and toil to make my elder brother and CM @BhagwantMann proud. https://t.co/xr2i0eYgFk pic.twitter.com/NiTppchsxz
— Raghav Chadha (@raghav_chadha) July 11, 2022