Supreme Court : పోలీసు రాజ్య‌మ‌నే ముద్ర రాకూడ‌దు

బెయిల్ పై కొత్త చ‌ట్టం తీసుకు రావాలి

Supreme Court : సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పెద్ద ఎత్తున బెయిల్ పిటిష‌న్లు వ‌స్తుండ‌డంపై కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. పోలీసు రాష్ట్రంగా మార్చ‌లేమ‌ని పేర్కొంది.

ఇదే స‌మ‌యంలో ప్ర‌జాస్వామ్యంలో స్వేచ్ఛ ప్ర‌ధాన‌మ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. బెయిల్ ద‌ర‌ఖాస్తుల‌ను రెండు వారాల్లోగా ప‌రిష్క‌రించాల‌ని తీర్పు చెప్పింది.

నాలుగు నెల‌ల్లో స్టేట‌స్ రిపోర్టు ఇవ్వాల‌ని అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు, యూటీలు, హైకోర్టుల‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. చ‌ట్టంలో పొందు ప‌ర్చిన స్వేచ్ఛ ర‌క్షించ‌బ‌డాలి.

క్రిమిన‌ల్ కేసుల్లో నిందితుల విడుద‌ల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించేందుకు బెయిల్ పై కొత్త చ‌ట్టాన్ని రూపొందించేందుకు కేంద్రం ప‌రిశీలించాల‌ని కేంద్రాన్ని ఆదేశించింది కోర్టు(Supreme Court) .

దేశంలోని జైళ్లు అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీల‌తో నిండి పోయాయ‌ని పేర్కొంది. ఇదే స‌మ‌యంలో గుర్తించ‌ద‌గిన నేరం న‌మోదు చేసిన‌ప్ప‌టికీ మెజారిటీని అరెస్ట్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని వెల్ల‌డించింది.

కార్య‌క‌ర్త‌లు, రాజ‌కీయ నాయ‌కులు, జ‌ర్న‌లిస్టుల‌తో స‌హా అనేక మంది అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీల బెయిల్ అభ్య‌ర్థ‌న‌ల‌ను అడ్డుకోవ‌డంతో కొత్త బెయిల్ చ‌ట్టాన్ని తీసుకు వాల‌ని కోరుతూ చేసిన సిఫార‌సు ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది.

ప్ర‌జాస్వామ్యంలో ఇది పోలీసు రాజ్యం అనే ముద్ర ఎప్పుడూ ఉండ కూడ‌ద‌ని న్యాయ‌మూర్తులు ఎస్కే కౌల్ , ఎంఎం సుంద‌రేష్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది.

రాజ్యాంగ విలువ‌లు, ధ‌ర్మాల‌ను ప‌రిర‌క్షించ‌డంలో అత్యుత్సాహంతో కాపాడు కోవ‌డం , స్థిర‌మైన దృక్ఫ‌థాన్ని కొన‌సాగించ‌డం క్రిమిన‌ల్ కోర్టు ప‌విత్ర‌మైన విధి అని వెల్ల‌డించింది.

బెయిల్ మంజూరు ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించేందుకు బెయిల్ చ‌ట్టం త‌ర‌హాలో ప్ర‌త్యేక చ‌ట్టాన్ని ప్ర‌వేశ పెట్టడాన్ని ప్ర‌భుత్వం ప‌రిగ‌ణించ‌వ‌చ్చ‌ని తెలిపింది.

Also Read : పార్ల‌మెంట్ లో అగ్నిప‌థ్ పైనే ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!