CM Terrorist Arrest : బెంగాల్ సీఎంను టార్గెట్ చేసిన టెర్ర‌రిస్ట్

మ‌ర్డ‌ర్ ప్లాన్ ను ఛేదించిన పోలీసులు

CM Terrorist Arrest : ఓ వైపు కేంద్రంపై నిప్పులు చెరుగుతూ ప‌శ్చిమ బెంగాల్ లో ముచ్చ‌ట‌గా మూడో సారి సీఎంగా కొలువు తీరిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని టార్గెట్ చేశారా. అవున‌నే అంటున్నారు పోలీసులు.

రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్ప‌టికీ ఆమె చాలా సాధార‌ణ‌మైన జీవితాన్ని గ‌డుపుతారు. హంగు ఆర్భాటం లేకుండా ఉండేందుకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. గ‌త కొంత కాలం నుంచి సీఎంకు మూడంచెల సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

కానీ వీట‌న్నింటిని దాటుకుని సీఎం ఇంట్లోకి ఓ ఉగ్ర‌వాది ప్రవేశించ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపింది.

కోల్ క‌తా లోని కాళీ ఘాట్ ప్రాంతంలో ఉన్న మ‌మ‌తా బెన‌ర్జీ ఇంటి వ‌ద్ద టెర్ర‌రిస్టు(CM Terrorist Arrest) హ‌ఫీజుల్ మొల్లా రెక్కీ నిర్వ‌హించిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఆమె క‌ద‌లిక‌ల‌పై కూడా క‌న్నేసిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది.

ఈ విష‌యాన్ని గుర్తించిన నిఘా వ‌ర్గాలు వ‌ల‌ప‌న్ని ఉగ్ర‌వాదిని అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ చేప‌ట్టారు. ఈ ద‌ర్యాప్తులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూసిన‌ట్లు స‌మాచారం.

త‌న సెల్ ఫోన్ లో మ‌మ‌తా బెన‌ర్జీ క‌ద‌లిక‌లు, ఆమె నివాసం కూడా ఫోటోలు తీసిన‌ట్లు స‌ద‌రు టెర్ర‌రిస్టు ఒప్పుకున్నాడు. ఈ మొత్తం ఘ‌ట‌న ఈనెల 2, 3 తేదీల మ‌ధ్య చోటు చేసుకుంది.

సీఎం సెక్యూరిటీని దాటుకుని ఇనుప రాడ్ తో ప్ర‌వేశించిన‌ట్లు గుర్తించారు. నిందితుడు 11 సిమ్ కార్డులు క‌లిగి ఉన్నాడ‌ని బంగ్లా దేశ్ , జార్ఖండ్, బీహార్ కు చెందిన ప‌లువురికి ఫోన్ చేసిన‌ట్లు నిర్ధారించారు.

Also Read : పోలీసు రాజ్య‌మ‌నే ముద్ర రాకూడ‌దు

Leave A Reply

Your Email Id will not be published!