Saad Aljabri : సౌదీ ప్రిన్స్ మామూలోడు కాదు సైకో
మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సాద్ అల్ జాబ్రీ
Saad Aljabri : సౌదీ అరేబియా ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ పై సంచలన కామెంట్స్ చేశారు ఆ దేశ ఇంటెలిజెన్స్ లో నెంబర్ టూగా ఉన్న అధికారి సాద్ ఆల్ జాబ్రీ.
ఆయన లెక్కలేనంత సంపదను పోగు చేశాడని, ఆపై సానుభూతి లేని సైకో అంటూ ఆరోపించారు. అమెరికాలోని సౌదీ రాయబార కార్యాలయం సాద్ అల్ జాబ్రీపై కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ జోసెఫ్ బైడెన్ యూఏఈని సందర్శించేందుకు కొద్ది రోజుల ముందు సీబీఎస్ న్యూస్ సాద్ ఆల్ జాబ్రీతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్)ని మానిసక రోగిగా అభివర్ణించారు. ఒకప్పుడు ఆల్ జాబ్రీ సౌదీ అరేబియాలో ఇంటెలిజెన్స్ లో నెంబర్ టూగా పనిచేశారు. ప్రిన్స్ అనంతమైన వనరులతో ఒక కిల్లర్ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
అంతే కాకుండా తనకు ఎదురు లేకుండా చేసేందుకు దేశంలో కిడ్నాప్ లు, హత్యలు చేసేందుకు టైగర్ స్క్వాడ్ పేరుతో కిరాయి సైనికులతో దుర్మార్గపు ముఠాను తయారు చేశాడని ఆరోపించాడు సాద్ ఆల్ జాబ్రీ(Saad Aljabri).
ప్రిన్స్ చేయని దారుణాలంటూ ఏవీ లేవన్నారు. అనంతమైన వనరులతో మిడిల్ ఈస్ట్ లో మానసిక రోగి, కిల్లర్, అలారం వినిపించేందుకు తాను అక్కడ పని చేశానని తెలిపారు.
భావోద్వేగాలను అనుభవించడు. అనుభవం నుంచి నేర్చుకోడు. ఈ హంతకుడు చేసిన దారుణాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ప్రాణ భయంతో దేశం విడిచి కెనడాకు పారి పోయాడు సాద్ ఆల్ జాబ్రీ.
2018లో, 2020లో సౌదీ క్రౌన్స్ ప్రిన్స్ పై వాషింగ్టన్ డీసీ కోర్టులో తనను చంపేందుకు స్క్వాడ్ ను పంపించాడంటూ దావా వేశాడు.
Also Read : అధికార మార్పిడికి గోటబోయ సిద్ధం