Gotabaya Rajapaksa : గోట‌బ‌య గుడ్ బై మాల్దీవుల‌కు ప‌రార్

అధ్యక్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్న ప్రెసిడెంట్

Gotabaya Rajapaksa : శ్రీ‌లంకలో చోటు చేసుకున్న సంక్షోభం ఇంకా కొన‌సాగుతున్న త‌రుణంలో ఆ దేశ అధ్య‌క్షుడి భ‌వ‌నంపై దాడికి దిగ‌డంతో దిగి రాక త‌ప్ప‌లేదు గోట‌బ‌య రాజ‌ప‌క్సే. బుధ‌వారం తాను రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

వేలాది మంది ఇంకా అధ్య‌క్షుడి నివాసంలోనే ఉన్నారు. మ‌రో వైపు పీఎం ర‌ణిలే విక్ర‌మ సింఘే ఇంటిని ముట్ట‌డించారు. ఆపై నిప్పంటించి ఆయ‌న వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు.

గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ప్రెసిడెంట్, ప్ర‌ధాన మంత్రి త‌మ ప‌ద‌వుల నుంచి త‌ప్పుకున్నారు. విప‌క్షాల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా పార్ల‌మెంట్ స్పీక‌ర్ కోరారు.

కొత్త‌గా స‌ర్కార్ కొలువు తీరేంత దాకా స్పీకరే రాజ్యాంగబ‌ద్దంగా దేశానికి ప్రెసిడెంట్ గా ఉంటారు. దాడి చేస్తార‌న్న భ‌యంతో శ్రీ‌లంక‌లోని కొలంబో నుంచి మాలే లోని వెలానా ఎయిర్ పోర్ట్ లో ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు గోట‌బ‌య రాజ‌ప‌క్సే(Gotabaya Rajapaksa) కు స్వాగ‌తం ప‌లికారు.

అధ్య‌క్షుడితో పాటు భార్య‌, ఇద్ద‌రు సెక్యూరిటీ గార్డులు గ‌త రాత్రి కొలంబో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుండి మేల్ బౌండ్ మిలిట‌రీ విమానాలో బ‌య‌లు దేరారు.

ఆయ‌న త‌మ్ముడు మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజ‌ప‌క్సే కూడా దేశం విడిచి పారి పోయాడు. త‌న‌కు విమానం చేకూర్చాల్సిందిగా ఆర్మీని కోరార‌ని ఆర్మీ చీఫ్ తెలిపారు.

ఆయ‌న ర‌క్ష‌ణ ద‌ళాల‌కు సుప్రీం క‌మాండ‌ర్ గా ఉన్నారు. గోట‌బ‌య రాజ‌ప‌క్సే దేశం విడిచి పారి పోయిన‌ట్లు పీఎంఓ ఆఫీసు ధ్రువీక‌రించింది.

ఇదిలా ఉండ‌గా గోట‌బ‌య , ఫ్యామిలీ త‌ప్పించు కునేందుకు భార‌త దేశం స‌హాయం చేసింద‌నే ప్ర‌చారాన్ని త‌ప్పు ప‌ట్టింది భార‌త హై క‌మిష‌న్.

Also Read : జ‌పాన్ ఎన్నిక‌ల్లో షింజో కూట‌మి విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!