Privatization Of Banks : ప్ర‌భుత్వ బ్యాంకులపై క‌న్నేసిన కేంద్రం

ఎస్బీఐ మిన‌హా అన్ని బ్యాంకులకు మంగ‌ళం

Privatization Of Banks : దేశాన్ని గంప గుత్తగా అమ్మ‌కానికి పెట్టిన బీజేపీ ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌పై ఫోక‌స్ పెట్టింది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను వ్యాపార‌వేత్త‌ల‌కు అప్పగించ‌డమో లేదా అమ్మ‌కానికి పెట్ట‌డ‌మో చేస్తూ వ‌చ్చింది.

తాజాగా ప్ర‌భుత్వ బ్యాంకుల‌ను సైతం ప్రైవేట్ ప‌రం చేసేందుకు పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను నిర్వీర్యం చేస్తూ వ‌చ్చింది.

ఇదే స‌మ‌యంలో వాటి సంఖ్యను మెల మెల్ల‌గా త‌గ్గించుకుంటూ వ‌స్తోంది. కోట్లాది ప్ర‌జ‌లు క‌ష్ట‌ప‌డి దాచుకున్న డ‌బ్బుల‌కు భ‌ద్ర‌త లేకుండా పోతోంద‌న్న‌మాట‌.

మొత్తంగా మోదీ ప్ర‌భుత్వం వ్యాపారుల‌కు అండ‌గా ఉంటూ వ‌స్తోంది. దేశంలోని ప్ర‌భుత్వ బ్యాంకుల‌న్నింటినీ ప్రైవేట్ ప‌రం(Privatization Of Banks) చేయాల‌ని డిసైడ్ అయ్యింది.

ఇందుకు సంబంధించి పార్ల‌మెంట్ లో బిల్లు తీసుకు వ‌చ్చేందుకు రెడీగా ఉంది. ఓ వైపు ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం దిశ‌గా దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఈ త‌రుణంలో ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తూ వ‌స్తున్న ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను నిర్వీర్యం చేసేందుకు కంక‌ణం క‌ట్టుకుంది. ఈ మేర‌కు ఆర్బీఐతో సంప్ర‌దింపులు కూడా ప్రారంభించింది.

బ్యాంకింగ్ కంపెనీల 1970లో రూపొందించిన చ‌ట్టాన్ని మార్చే ప‌నిలో ప‌డింది. ఇక దేశానికి విశిష్ట సేవ‌లందిస్తూ లాభాల్లో ఉన్న ఎల్ఐసీ, ఎయిర్ ఇండియా, ఆయిల్ కంపెనీలను అమ్మకానికి పెట్టింది బీజేపీ స‌ర్కార్.

ప్రైవేట్ సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వ బ్యాంకుల‌ను అప్ప‌గించే ప‌నిలో ప‌డింది. ముందుగా ఐవోబీ, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ప్రైవేట్ ప‌రం చేసే యోచ‌న‌లో ఉంది. ఒక్క ఎస్బీఐ త‌ప్పా అన్నీ ప్రైవేట్ కానున్నాయ‌న్న‌మాట‌.

Also Read : ఎస్సై భ‌ర్తీ స్కాం బీజేపీ నేత దివ్య నిర్వాకం

Leave A Reply

Your Email Id will not be published!