Dalai Lama : టిబెట్ కు స్వ‌యం ప్ర‌తిప‌త్తి ఇవ్వాలి

చైనాకు స్ప‌ష్టం చేసిన ద‌లైలామా

Dalai Lama : టిబెటిన్ ఆధ్యాత్మిక నాయ‌కుడు ద‌లైలామా రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌మ్మూ కాశ్మీర్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న‌ను వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్న చైనా క‌ల‌వ‌రానికి గుర‌వుతోంది.

ఇదిలా ఉండ‌గా తూర్పు ల‌డ‌ఖ్ లోని వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ (ఎల్ఓసీ ) వెంబ‌డి చైనా పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ (పీఎల్ఏ) , భార‌త సైన్యం మ‌ధ్య సుదీర్ఘ‌మైన ప్ర‌తిష్టంభ‌న నెల‌కొంది.

ఈ త‌రుణంలో ద‌లైలామా ల‌డ‌ఖ్ ప‌ర్య‌ట‌నపై డ్రాగ‌న్ దేశం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. కాగా ద‌లైలామా ఈ ల‌డ‌ఖ్ ప్రాంతంలో నెల రోజుల పాటు ఆధ్యాత్మిక నాయ‌కుడు బ‌స చేయ‌నున్నారు.

గ‌తంలో ఆగ‌స్టు 2019లో జ‌మ్మూ కాశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన త‌ర్వాత ద‌లైలామా మొద‌టిసారిగా ప‌ర్య‌టిస్తున్నారు.

అయితే ద‌లైలామా(Dalai Lama) జ‌మ్మూ చేరుకున్న వెంట‌నే తాను టిబెట్ కు పూర్తి స్వాతంత్రం కోరుకోవ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. టిబెట్ బౌద్ధ సంస్కృతిని ప‌రిర‌క్షించాల‌ని, చైనాలో అర్థ‌వంత‌మైన స్వ‌యం ప్ర‌తిప‌త్తిని కోరుతున్నాన‌ని స్ప‌ష్టం చేశాడు.

ఇదే విష‌యాన్ని గ‌తంలో ప‌లుమార్లు చెప్ప‌డం జ‌రిగింద‌న్నారు ద‌లైలామా. చైనాను ఉక్కుపాదంతో అణిచి వేయాల‌ని అనుకుంటున్న వారే త‌న‌ను వేర్పాటువాదిగా ప‌రిగ‌ణిస్తార‌ని పేర్కొన్నారు.

కానీ చాలా మంది ప్ర‌జ‌లు త‌న‌ను అలా అనుకోవ‌డం లేద‌న్నారు . ఇవాళ ఆయ‌న లేహ్ కు వెళ‌తారు. కాగా ఇటీవ‌ల చైనా భార‌త దేశాన్ని విమ‌ర్శించింది.

ప్ర‌ధాని మోదీ దలైలామాకు ఫోన్ చేసి 87వ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. దీనిపై డ్రాగ‌న్ అభ్యంత‌రం తెలిపింది.

Also Read : ద‌లేర్ మెహందీకి 2 ఏళ్ల‌ జైలు శిక్ష‌..జ‌రిమానా

Leave A Reply

Your Email Id will not be published!