Sri Lanka Speaker : వారం రోజుల్లో శ్రీలంక చీఫ్ ఎన్నిక – స్పీకర్
ప్రకటించిన మహింద యాపా అబేవర్దన
Sri Lanka Speaker : శ్రీలంక సంక్షోభానికి తెర దించే ప్రయత్నం జరుగుతోంది. అధ్యక్షుడిగా ఉన్న గోటబయ రాజపక్సే పై లంకేయులు యుద్దం ప్రకటించడంతో తన రాజభవనం వదిలేసి దేశం విడిచి పారి పోయాడు.
మాల్దీవులకు వెళ్లిన రాజపక్సే దాడి చేస్తారన్న భయంతో అక్కడి నుంచి సింగపూర్ చెక్కేశాడు. ఇదే సమయంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఈమెయిల్ ద్వారా పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబేవర్దన కు పంపించారు.
దీంతో 225 మంది సభ్యులు కొత్త అధ్యక్షుడిని దేశం కోసం ఎన్నుకుంటారు. తాజాగా అందిన సమాచారం మేరకు ముగ్గురు బరిలో ఉన్నారు.
తాత్కాలిక చీఫ్, పీఎంగా ఉన్న రణిలే విక్రమ సింఘే, ప్రేమదాసతో మరో జర్నలిస్ట్ పోటీ పడుతున్నారు. ఇదిలా ఉండగా శ్రీలంక అధ్యక్షుడిని వారం రోజుల్లో ఎన్నుకుంటారని స్పీకర్(Sri Lanka Speaker) ప్రకటించారు.
శుక్రవారం మహింద యాపా అబేవర్దన మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా 1978లో శ్రీలంక అధ్యక్ష ప్రభుత్వ విధానాన్ని ఆమోదించిన తర్వాత రాజీనామా చేసిన మొదటి అధ్యక్షుడు గోటబయ రాజపక్సే(Gotabaya Rajapaksa) కావడం విశేషం.
ఏడు రోజుల్లో కొత్త అధ్యక్షుడు కొలువు తీరుతారని చెప్పారు. ఆయన చేసిన రాజీనామాను ఆమోదించినట్లు వెల్లడించారు.
గురువారం నుండి ఆయన ఇక ప్రెసిడెంట్ గా ఉండరని చెప్పారు స్పీకర్. తాను రాజీనామా చేస్తున్నట్లు అర్ధరాత్రి ఈమెయిల్ ద్వారా తనకు అందిందన్నారు.
ఇదిలా ఉండగా దేశంలో ఎన్నడూ లేని రీతిలో ఆర్థిక, ఆహార, ఆయిల్, విద్యుత్ సంక్షోభం నెలకొంది. లంకేయుల ఆగ్రహానికి ప్రెసిడెంట్ పారి పోయాడు. ప్రధాని నేవీ, ఆర్మీ క్యాంపులో తలదాచుకున్నాడు.
Also Read : టిబెట్ కు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి