Devendra Fadnavis : రాజ్ ఠాక్రేతో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ
రాజకీయ వర్గాల్లో మరో ముందడుగు
Devendra Fadnavis : రాజకీయ రంగంలో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్నది వాస్తవం. ఈ దేశంలో మాన్యశ్రీ కాన్షీ రామ్ ఏనాడో చెప్పారు జరుగుతున్న తతంగాన్ని కుండ బద్దలు కొట్టారు.
మనీ..మీడియా..మాఫియా రాజ్యామేలుతోందని. గతంలో రాజకీయ పార్టీలకు విలువలు, సిద్ధాంతాలు ఉండేవి. ఇవాళ కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం తల్చుకుంటే కేవలం రెండు నిమిషాల్లో కూల్చగలదని ఆ పార్టీకి చెందిన మధ్య ప్రదేశ్ ఎమ్మెల్యే నారయణ్ త్రిపాఠి సంచలన కామెంట్స్ చేశారు.
అది పక్కన పెడితే శివసేన, కాంగ్రెస్ , ఎన్సీపీ కలిసి మహా వికాస్ అఘాడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూల దోశారు.
శివసేనకు చెందిన ఏక్ నాథ్ షిండే సీఎం కాగా సపోర్ట్ చేసిన భారతీయ జనతా పార్టీ చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ఉప ముఖ్యమంత్రిగా కొలువు తీరారు.
ఈ తరుణంలో శివసేన పార్టీతో తెగ దెంపులు చేసుకుని బయటకు వచ్చిన ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేతో శుక్రవారం డీసీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ అయ్యారు.
దీంతో మరాఠా రాజకీయాలలో తీవ్ర చర్చకు దారి తీసింది. గత నెలలో రాజ్ ఠాక్రే ఆస్పత్రిలో చేరారు. ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. సర్జరీ తర్వాత ఫడ్నవీస్ ఠాక్రేను సందర్శించడం ఇదే తొలిసారి.
ఇదే సమయంలో అత్యున్నత పదవి స్వీకరించే చాన్స్ వచ్చినా దానిని వదులుకున్నందుకు ఫడ్నవీస్ ను అభినందిస్తూ లేఖ రాశారు రాజ్ థాక్రే.
ఈ తరుణఃలో ఎంఎన్ఎస్ కు ఒక్కరే ప్రజాప్రతినిధిగా ఉన్నారు. తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఫడ్నవీస్ ను రాజ్ ఠాక్రేను(RajThackeray), కోరినట్లు సమాచారం.
Also Read : మరాఠాలో ప్రభుత్వం లేదు – సంజయ్ రౌత్