Sri Lanka Court : గోటబయ బ్రదర్స్ దేశం విడిచి వెళ్లొద్దు
ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
Sri Lanka Court : శ్రీలంక దేశంలో సంక్షోభం మరింత ముదిరింది. ఇప్పటికే దేశ అధ్యక్షుడు దేశం విడిచి మాల్దీవులకు పారి పోయాడు. అక్కడ తనపై దాడి చేస్తారని భావించి గోటబయ రాజపక్సే నేరుగా సింగపూర్ వెళ్లాడు.
గోటబయ కుటుంబం రాజీనామా చేయాలంటూ లంకేయులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తన స్థానంలో రణిలే విక్రమ సింఘే తాత్కాలిక దేశ అధ్యక్షుడు అవుతాడంటూ ప్రకటించడంతో ఆగ్రహం మరింత ముదిరింది.
దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో గోటబయ రాజపక్సే ఈ మెయిల్ ద్వారా గురువారం అర్ధరాత్రి పార్లమెంట్ స్పీకర్ కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. దీని గురించి స్పీకర్ ప్రకటించారు.
మరో వారం రోజుల్లో అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని ప్రకటించారు. ప్రస్తుతం రణిలెతో పాటు మరో ఇద్దరు ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే సింహళీయులు అత్యధికంగా నివసించే శ్రీలంకలో పెద్ద ఎత్తున రాజపక్సే కుటుంబీకులు తమ పవర్ ను చెలాయిస్తూ వస్తున్నారు.
వారి పార్టీకి చెందిన వారే అత్యధికంగా సభ్యులు ఉన్నారు. దీంతో ప్రెసిడెంట్ గా ఎవరు వచ్చినా మళ్లీ వాళ్లే అధికారం చెలాయిస్తారంటూ నిప్పులు చెరుగుతున్నారు.
ఈ తరుణంలో శ్రీలంక సుప్రీంకోర్టు(Sri Lanka Court) సంచలన తీర్పు చెప్పింది. గోటబయ రాజపక్సే సోదరులు మహీంద రాజపక్సే, బాసిల్ రాజపక్సేతో పాటు కుటుంబీకులు ఎవరూ దేశం విడిచి వెళ్ల వద్దంటూ ఆదేశించింది.
ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ప్రధాని మహీంద రాజపక్సే ప్రస్తుతం నేవీ, ఆర్మీ క్యాంపులో తలదాచుకున్నారు. ప్రస్తుతం కోర్టు ఇచ్చిన ఆదేశాలు కలకలం రేపాయి.
Also Read : వారం రోజుల్లో శ్రీలంక చీఫ్ ఎన్నిక – స్పీకర్