Yashwant Sinha : ఫోన్ చేసినా రిప్లై ఇవ్వని సీఎం – సిన్హా
రాష్ట్రపతి అభ్యర్థి సంచలన కామెంట్స్
Yashwant Sinha : విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బీహార్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పాట్నాలో పలువురు ప్రజా ప్రతినిధులను ఆయన కలుసుకున్నారు.
ఇదే సమయంలో తాను బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు ఫోన్ చేసినా పలకలేదని ఆరోపించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఈ దేశంలో రాచరికం నడుస్తోందని దానిని అడ్డుకోవాలంటే రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ అయి ఉండకూడదని స్పష్టం చేశారు. నితీష్ కుమార్ ఇప్పుడు సీఎంగా ఉన్నారు.
ఆయనకు తాను ఇప్పుడు కనిపించనని పేర్కొన్నారు. ప్రతిపక్షాల ప్రతినిధులతో కీలక భేటీ అనంతరం యశ్వంత్ సిన్హా మీడియాతో మాట్లాడారు. ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను ఎన్ని సార్లు చేసినా తిరిగి రిప్లై ఇవ్వలేదని, చాలా ఎదిగి పోయాడంటూ ఎద్దేవా చేశారు యశ్వంత్ సిన్హా. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు పాతరేసిందని ఆరోపించారు.
ఈ దేశంలో సామాన్యులకు విలువ, భద్రత లేకుండా పోయిందని వాపోయారు. రాష్ట్రపతి పదవికి భారత రాజ్యాంగంలో సమున్నతమైన స్థానం ఉందని కానీ దానిని ఓ స్టాంపు గా మార్చేసిన ఘనత నేటి సర్కార్ దేనంటూ సంచలన ఆరోపణలు చేశారు యశ్వంత్ సిన్హా(Yashwant Sinha).
దేశానికి దిశా నిర్దేశం చేసే వ్యక్తి రాష్ట్రపతి పదవిలో ఉండాలని స్పష్టం చేశారు. లేక పోతే ఆ పదవికి న్యాయం చేయలేరని పేర్కొన్నారు. చట్టం రూపొందించినా దానిని అమలు పర్చే సంతకం మాత్రం రాష్ట్రపతిది అయి ఉంటుందన్న సంగతి మరిచి పోవద్దన్నారు.
Also Read : మహ్మద్ జుబైర్ కు బెయిల్ మంజూరు