Digital Media News : డిజిటల్ మీడియాపై కేంద్రం న‌జ‌ర్

ప్ర‌భుత్వ ప‌రిధిలోకి సోష‌ల్ మీడియా

Digital Media News : కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి ప్ర‌తిప‌క్షంగా త‌యారైన సోష‌ల్ మీడియా, డిజిట‌ల్ మీడియాను(Digital Media News) నియంత్రించేందుకు ప్లాన్ చేస్తోంది.

ఇక నుంచి ఏదైనా వ్య‌తిరేకంగా వార్త‌లు వ‌చ్చినా లేదా ప్ర‌సార‌మైనా వెంట‌నే వాటిని త‌మ నియంత్ర‌ణ‌లోకి తీసుకు వ‌చ్చేందుకు శ్రీ‌కారం చుట్టింది. ఇప్ప‌టికే డిజిట‌ల్ మీడియాపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఇందుకు సంబంధించి ఈనెల 18 నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ స‌మావేశాల్లోనే డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు గాను బిల్లును ప్ర‌వేశ పెట్టాల‌ని యోచిస్తోంది.

డిజిట‌ల్ (సోష‌ల్ ) మీడియాను అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేసే వారిపై చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు తీసుకునేందుకు వీలు క‌ల్పించే హ‌క్కు చ‌ట్టంగా మార‌నుంది.

ఒక వేళ త‌ప్పుడు స‌మాచారం లేదా అసంబద్ద స‌మాచారం ఇచ్చిన‌ట్ల‌యితే స‌ద‌రు పోర్ట‌ల్, యూట్యూబ్ చాన‌ల్ రిజిస్ట్రేష‌న్ ర‌ద్దు చేయ‌డంతో పాటు జ‌రిమానా కూడా విధిస్తారు.

క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు వీలు క‌లుగుతుంది. ఇక నుంచి డిజిట‌ల్ మీడియా (న్యూస్ పోర్ట‌ల్స్ , యూట్యూబ్ చాన‌ల్స్ ) కేంద్ర , రాష్ట్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ క‌స‌ర‌త్తు ప్రారంభించింది.

దీని వ‌ల్ల కంపల్స‌రీగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా చ‌ట్టం గ‌నుక అమ‌లు లోకి వ‌స్తే మూడు నెల‌ల లోపు డిజిట‌ల్ న్యూస్ ప‌బ్లిష‌ర్లు త‌మ వెబ్ సైట్లు, చాన‌ళ్ల‌ను రిజిస్ట్రేష‌న్ కోసం ప్రెస్ రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్ కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read : ట్విట్ట‌ర్ మ‌స్క్ కేసులో అరుదైన తీర్పు

1 Comment
  1. ఆవుల రామారావు says

    అవును ఏదేని పౌరులుగాని ప్రతిపక్షం గాని అలాగే అధికార పక్షం గాని వాస్తవ పరిస్థితులు మాత్రమే ప్రచారం చేసేవిధంగా సాగాలికాని ఉన్న దానినిలేనట్టు లేనిదానిని ఉన్న చూపటం తప్పుడులెక్కలు చూపటం లాంటివి చాలా భాధకర విషయాలు వాస్తవ పరిస్థితులను వీడియో రూపంలోగాని వాయిస్ రూపంలో గాని ప్రింట్ రూపంలోగాని రావాలి ఈ నియంత్రనా సోషల్ మీడియానే కాదు అన్ని రకాల వార్త చానల్స్ ఫ్రింట్ మీడియాకి వర్తించేలా చెయ్యాలి తప్పుడు ప్రచారాలని అరికట్టాలి

Leave A Reply

Your Email Id will not be published!