Centre Introduce Bills : 24 బిల్లులు ప్ర‌వేశ పెట్ట‌నున్న కేంద్రం

18 నుంచి వ‌ర్షాకాల స‌మావేశాలు

Centre Introduce Bills : ఈనెల 18 నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్కంఠ‌కు తెర లేపింది ఈ రోజే. ఎందుకంటే ఆరోజున భార‌త దేశ స‌ర్వోన్న‌త ప‌ద‌విగా భావించే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌ర‌గనుంది.

బీజేపీ ఎన్డీయే ఉమ్మ‌డి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఆదివాసీ బిడ్డ ద్రౌప‌ది ముర్ము బ‌రిలో ఉండ‌గా ప్ర‌తిప‌క్షాల ఉమ్మ‌డి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు.

ఈనెల 21న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఫ‌లితాలు వెల్ల‌డిస్తుంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఇదిలా ఉండ‌గా ఈ వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలలో కీల‌క‌మైన 24 బిల్లుల‌ను ప్ర‌వేశ పెట్ట‌నుంది కేంద్రం స‌ర్కార్.

నిషేధిత ప్రాంతాల‌ను హేతు బ‌ద్దీక‌రించి, ఇత‌ర స‌వ‌ర‌ణలు తీసుకు రావాల‌ని ప్ర‌తిపాదించిన పురాత‌న స్మార‌క చిహ్నాలు, పురావ‌స్తు ప్ర‌దేశాలు, అవ‌శేషాల బిల్లును కూడా సిద్దం చేసింది.

కంటోన్మెంట్ బిల్లు, మ‌ల్టీ స్టేట్ కోఆప‌రేటివ్ సొసైటీస్ (స‌వ‌ర‌ణ ) బిల్లు, దివాలా, దివాలా కోడ్ (స‌వ‌ర‌ణ ) బిల్లులు ముందుకు రానున్నాయి.

కాఫీ బిల్లు, ఎంట‌ర్ ప్రైజెస్ , సేవ‌ల కేంద్రాల అభివృద్ది బిల్లు, ప్ర‌త్యేక ఆర్థిక మండ‌లాల చ‌ట్టం -2005 , ,రిజిస్ట్రేష‌న్ ర‌క్ష‌ణ స‌వ‌ర‌ణ బిల్లు, గిడ్డంగుల అభివృద్ది , నియంత్ర‌ణ స‌వ‌ర‌ణ బిల్లును(Centre Introduce Bills) ప్ర‌వేశ పెట్ట‌నుంది.

క‌ళా క్షేత్ర ఫౌండేష‌న్ స‌వ‌ర‌ణ బిల్లు, పాత గ్రాంటు నియంత్ర‌ణ బిల్లు, అటవీ ప‌రిర‌క్ష‌ణ స‌వ‌ర‌ణ బిల్లు, నేష‌న‌ల్ డెంటల్ క‌మిష‌ణ్ బిల్లు, నేష‌న‌ల్ న‌ర్సింగ్ అండ్ మిడ్ వైఫ‌రీ క‌మిష‌న్ బిల్లు, ఐఐఎం స‌వ‌ర‌ణ బిల్లు, కేంద్రీయ విశ్వ విద్యాలయ స‌వ‌ర‌ణ బిల్లు ప్ర‌వేశ పెట్ట‌నుంది. ఇంకా బిల్లులు ప్ర‌వేశ పెట్ట‌నుంది.

Also Read : డిజిటల్ మీడియాపై కేంద్రం న‌జ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!