Congress Patel : అహ్మద్ పటేల్ పై ఆరోపణలు అబద్దం
గుజరాత్ అల్లర్ల కేసులో సిట్ పై ఫైర్
Congress Patel : గుజరాత్ రాష్ట్రంలో 2002లో జరిగిన అల్లర్ల కేసులో ఆనాటి సీఎం, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో లేదా అస్థిర పరిచే కుట్రలో దివంగత కాంగ్రెస్ పార్టీ నాయకుడు అహ్మద్ పటేల్(Ahmed Patel) పాత్ర ఉందంటూ ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్ ) ఆరోపించింది.
అంతే కాకుండా పిటిషన్ దాఖలు చేసిన సెతల్వాద్ కు ఆయన బతికి ఉన్న సమయంలో రూ. 30 లక్షలు కూడా ఇచ్చారంటూ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
ఈ మొత్తం కుట్రకు పూర్తిగా పటేల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్(Congress) నాయకుడు ఇప్పుడు ఈ లోకంలో లేడు. తాజాగా పటేల్ పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది కాంగ్రెస్ పార్టీ.
ఇది పూర్తిగా రాజకీయ కుట్రగా అభివర్ణించింది. దీని వెనుక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించి జాతీయ పార్టీ స్పోక్స్ పర్సన్, మీడియా ఇన్ చార్జి జై రాం రమేష్ పేరుతో ప్రకటన విడుదల చేసింది.
ఇది పూర్తిగా నిరాధారమైనదని పేర్కొంది. పటేల్ పన్నిన కూల దోసే కుట్రలో సెతల్వాద్ కూడా ప్రధాన భాగస్వామి అంటూ స్పష్టం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది కాంగ్రెస్ పార్టీ(Congress).
ఇప్పటికే వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోదీకి ఇలాంటివి కొత్త కాదంటూ మండి పడింది.
2002లో సీఎంగా ఉన్న మోదీ ఎలాగైనా తనపై వచ్చిన ఆరోపణలను తప్పించు కోవాలనే ఇలాంటి నిందలు వేస్తున్నారంటూ ఆరోపించారు జై రాం రమేష్.
Also Read : మోదీకి వ్యతిరేకంగా ‘పటేల్’ కుట్ర – సిట్
Statement Issued by @Jairam_Ramesh , General Secretary In- Charge, Communications, AICC pic.twitter.com/vZo55UcDcN
— Congress (@INCIndia) July 16, 2022