CM KCR : వరద బాధితులకు సీఎం ఆసరా
రూ. 10 వేలు ఇస్తామని ప్రకటన
CM KCR : నైరుతి రుతు పవనాల దెబ్బకు భారీ వర్షాలు తెలంగాణలోని పలు జిల్లాలను ముంచెత్తాయి. గ్రామాల మధ్య రాక పోకలు, సంబంధాలు తెగి పోయాయి.
మొన్నటి దాకా శాంతించిన గోదావరమ్మ ఎన్నడూ లేని రీతిలో పోటెత్తింది. ఊళ్లను ముంచెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సహాయక చర్యలు చేపట్టింది.
ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ వరదలపై సమీక్షించారు. ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.
వరదల దెబ్బకు నిరాశ్రయులైన వారికి, దెబ్బ తిన్న ఇళ్లు, పంటలను పరిశీలించారు ఆదివారం సీఎం(CM KCR). ఆయన ఏరియల్ సర్వే చేపట్టారు. ఈ సందర్బంగా ముంపు బాధితులకు తాను అండగా ఉంటానని ప్రకటించారు.
ఈ మేరకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. అంతే కాకుండా దెబ్బ తిన్న ఇళ్ల స్థానంలో రూ. 1,000 కోట్లతో కొత్తగా కాలనీని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
వరదలు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఎత్తైన ప్రదేశాలలో ఇళ్లను కట్టిస్తామని తెలిపారు సీఎం. వరద ప్రాంతాలను దగ్గరుండి పరిశీలించారు.
గోదారమ్మ శాంతించాలంటూ పూజలు చేశారు. అనంతరం ఐటీడీఏలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. వరదల్లో భద్రాచలం, పినపాక నియోజకవర్గాలు చాలా దెబ్బతిన్నాయని తెలిపారు.
కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు అద్భుతంగా పని చేశారంటూ కితాబు ఇచ్చారు సీఎం.
Also Read : సీఎం కేసీఆర్ పై బండి కన్నెర్ర
CM Sri KCR interacting with media personnel after inspecting the flood-affected areas in Bhadrachalam https://t.co/dy2ri1UY5J
— Telangana CMO (@TelanganaCMO) July 17, 2022