La Ganesan : మణిపూర్ గవర్నర్ కు బెంగాల్ బాధ్యతలు
ప్రస్తుత గవర్నర్ ఉప రాష్ట్రపతి బరిలో
La Ganesan : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిల్లి కజ్జాలు, నిత్యం వివదాలకు కేంద్ర బిందువుగా మారిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ ఖర్ కు ఊహించని రీతిలో బంపర్ ఆఫర్ తగిలింది.
ఆయన ఒక రకంగా గవర్నర్ గా కంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పని చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇటీవల బెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయానికి తొత్తుగా పని చేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు.
కానీ మోదీ అందలం ఎక్కించారు. ఏకంగా దేశంలోని రెండో అత్యున్నత పదవిగా భావించే ఉప రాష్ట్రపతి పదవి అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇది ఊహించని పరిణామం.
ఇప్పటికే ఆదీవాసీ తెగకు చెందిన ద్రౌపది ముర్ముకు రాష్ట్రపతి చాన్స్ ఇచ్చారు. ఇదే సమయంలో జగదీప్ కు ఈ పదవిని ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజకీయ పదవులకు పునరావాసంగా రాజ్ భవన్ , రాష్ట్రపతి భవన్ మారిందని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో బెంగాల్ గవర్నర్ స్థానంలో మణిపూర్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న లా గణేశన్ కు (La Ganesan)అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఈ మేరకు కేంద్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉప రాష్ట్రపతి బరిలో ఉన్న జగ దీప్ తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రిజైన్ ను ఆమోదించినట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉండగా లా గణేశన్ నియామకంపై రాష్ట్రపతి సంతకం చేశారు. నియామకం జరిపిన వెంటనే చార్జ్ తీసుకున్నారు లా గనేశన్(La Ganesan).
Also Read : త్వరలోనే గిరిజన యూనివర్శిటీకి మోక్షం