Sidharamaiah : 2023 అసెంబ్లీ ఎన్నికలే నాకు చివరివి
మాజీ సీఎం సిద్దరామయ్య కామెంట్స్
Sidharamaiah : మాజీ కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన కామెంట్స్ చేశారు. త్వరలో రాష్ట్రంలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరివంటూ చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో, రాష్ట్ర రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారి తీశాయి.
మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగారు కాంగ్రెస్ లో. అపారమైన అనుభవం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. అసెంబ్లీ పదవీ కాలం తర్వాత రాజ్యసభతో సహా ఏ పదవిని తాను స్వీకరించనని స్పష్టం చేశారు.
ఆ ఎన్నికలే తనకు ఆఖరివని పేర్కొన్నారు. 2018లో ఓటమి చవి చూసిన చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడం లేదని కుండ బద్దలు కొట్టారు సిద్దరామయ్య. కర్ణాటకలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం సిద్దరామయ్య (Sidharamaiah) అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆనాడు భారతీయ జనతా పార్టీ చేసిన తప్పుడు ప్రచారం వల్లనే తాను ఓటమి పాలైనట్లు ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సిద్దరామయ్య. ఆ నియోజకవర్గ ప్రజలకు చెప్పండి. నేను బరిలో ఉండడం లేదు.
అక్కడ పార్టీ పరంగా పోటీ చేసే వ్యక్తులు ఎవరైనా సరే వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. చాముండేశ్వరి ప్రజలు నన్ను తిరస్కరించారు.
కానీ బాదామీ ప్రజలు నా చేతులు పట్టుకున్నారు. నేను మళ్లీ అక్కడి నుంచే పోటీ చేయాలని కోరుతున్నారు. అయితే నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానంటూ చెప్పారు సిద్ద రామయ్య. అవినీతి, మత తత్వ ప్రభుత్వం పోయేందుకే తాను బరిలో ఉంటున్నానని తెలిపారు.
Also Read : మార్గరెట్ అల్వాకు శివసేన మద్ధతు – రౌత్