DK Shivakumar : సిసలైన బీజేపీ సర్కార్ నడపడం లేదు
కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కామెంట్స్
DK Shivakumar : కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ చేశారు. అసలైన భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది రాజకీయ వర్గాలలో.
విచిత్రం ఏమిటంటే ప్రస్తుతం సీఎంగా కొలువు తీరిన బసవరాజ్ బొమ్మై బీజేపీకి చెందిన వ్యక్తి కాదంటూ బాంబు పేల్చారు. ఆయన వేరే పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయ్యాడంటూ ఎద్దేవా చేశాడు డీకే శివకుమార్.
అధికార పార్టీలో చాలా సమస్యలు ఉన్నాయని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం కేరాఫ్ గా మారిందని ధ్వజమెత్తారు. కర్ణాటకలో అస్సలు ప్రభుత్వం ఉందా అన్న అనుమానం తనకే కాదు రాష్ట్ర ప్రజలకు కలుగుతోందన్నారు.
ప్రస్తుతం సంకీర్ణ సర్కార్ నడుస్తోందని, ఇందులోని వారంతా అసలు సిసలైన కాషాయధారులు కాదని స్పష్టం చేశారు. డీకే శివకుమార్(DK Shiva Kumar) ఏఎన్ఐతో మాట్లాడారు. ఇది బీజేపీతో కూడిన ప్రభుత్వం అనుకుంటే పొరపాటు పడినట్లేనని పేర్కొన్నారు.
ఇది అన్ని పార్టీలకు చెందిన వారితో కలిసి ఉన్న కూటమిగా డీకే శివకుమార్(DK Shivakumar) అభివర్ణించారు. ఓ వైపు సమస్యలు పేరుకు పోతుంటే సీఎం మాత్రం స్పందించక పోవడం దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేపీసీసీ చీఫ్.
కాంగ్రెస్ , జేడీఎస్ ల నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లిన వారే 60 శాతానికి పైగా ఉన్నారని అందుకే సర్కార్ లో సమన్వయం కొరవడిందన్నారు.
Also Read : ఉప రాష్ట్రపతి బరిలో మార్గరెట్ అల్వా