Rahul Gandhi : మోదీపై నిప్పులు చెరిగిన రాహుల్
పీఎం మౌనంపై గాంధీ మండిపాటు
Rahul Gandhi : కాంగ్రెస్ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సాక్షిగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, దానిని నడిపిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వాకాన్ని ఎండగట్టారు.
అన్ పార్లమెంటరీ అంటున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చకు దూరంగా పారి పోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదోనన్న అంశం గురించి పార్లమెంట్ ఇటీవల ప్రవర్తనా నియామవళి పేరుతో బుక్ లెట్ తీసుకు వచ్చింది. ఇది కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే చేసిన ప్రయత్నం తప్పా మరొకటి కాదన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .
మంగళవారం లోక్ సభ సాక్షిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర విపక్ష పార్టీలన్నీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. లోక్ సభ దద్దరిల్లింది. రాజ్యసభ నినాదాలతో హోరెత్తింది.
ప్రధాని ప్రశ్నలకు సమాధానం ఇవ్వక పోవడం అన్ పార్లమెంటరీ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ధరల పెరుగుదల, జీఎస్టీ రేట్ల పెంపు , రూపాయి విలువ క్షీణించడం వంటి సమస్యలపై కాంగ్రెస్ మాజీ చీఫ్ ఫైర్ అయ్యారు.
ప్రతిపక్షాల నోరు మెదిపేందుకు ప్రధాని ఎంత ప్రయత్నించినా ఈ అంశాలపై సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. లోక్ సభ తీసుకు వచ్చిన బుక్ లెట్ గురించి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
కాగా అన్ పార్లమెంటరీ పదాలను జాబితా చేసే పద్దతి 1954 నాటి నుంచి జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
Also Read : నీట్ మెడికల్ సీట్ల స్కాంలో ముందడుగు