Anurag Thakur : గీత దాటిన ప్రైవేట్ ఛానళ్లపై నజర్
మత పరమైన వ్యాఖ్యలు ప్రసారం
Anurag Thakur : న్యూస్ ఛానళ్లు స్వీయ నియంత్రణ పాటించాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
ఇటీవల దేశంలో ప్రైవేట్ వార్తా ఛానళ్లు తమ రేటింగ్ పెంచుకునేందుకు పదే పదే వ్యాఖ్యలను , ప్రధానంగా మత పరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రసారం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur).
ఇందుకు సంబంధించి దేశ వ్యాప్తంగా ప్రసారం అవుతున్న అన్ని ఛానళ్ల డేటాను తాము సేకరిస్తున్నామని ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
ప్రోగ్రామ్ కోడ్ ను ఉల్లంఘించిన ప్రైవేట్ టీవీ ఛానళ్లపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి సంస్థాగత యంత్రాంగం ఉందన్నారు అనురాగ్ ఠాకూర్. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి.
గత మూడు సంవత్సరాలలో ప్రోగ్రామ్ కోడ్ ను ఉల్లంఘిస్తూ మత పరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రసారం చేసిన 163 సందర్భాలను ఫ్లాగ్ చేస్తూ ప్రైవేట్ టెలివిజన్ ఛానళ్లకు(Private channels) కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి లోక్ సభలో సుదీర్గ వివరణ ఇచ్చారు. లోక్ సభలో సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాత పూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.
గత మూడేళ్లతో పాటు ప్రస్తుత సంవత్సరంలో ప్రభుత్వం 163 కేసులకు సంబంధించి సలహాలు, హెచ్చరికలు, క్షమాపణ స్కోల్ ఆర్డర్ లు , ఆఫ్ ఎయిర్ ఆర్డర్ లు జారీ చేయడం ద్వారా చర్యలు తీసుకుందన్నారు.
Also Read : ప్యాకింగ్ ఫుడ్స్ పై జీఎస్టీ అవసరం – నిర్మలా