S Jai Shankar : భారత్ లో సంక్షోభానికి తావు లేదు -జై శంకర్
శ్రీలంక సంక్షోభం ఇక్కడ ఉండదు
S Jai Shankar : భారత దేశంలో శ్రీలంక లాంటి సంక్షోభం ఏర్పడుతుందా అన్నది ప్రధానంగా ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నది. ద్వీప దేశంలో అత్యధికంగా తమిళులు జీవిస్తున్నారు.
వారికి అన్యాయం జరగకుండా కేంద్ర సర్కార్ జోక్యం చేసుకోవాలని డీఎంకే, అన్నాడీఎంకే ఎంపీలు కోరారు. ఇదిలా ఉండగా మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశం జరిగింది.
ఈ కీలక భేటీలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar) కూడా పాల్గొన్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటు తర్వాత ద్వీప దేశంలో రాజకీయ సంక్షోభానికి దారితీసింది.
దీనిపై చర్చకు వచ్చింది. కేంద్రంలోని మోదీ(PM Modi) ప్రభుత్వంలో ఎన్నడూ లేని రీతిలో రూపాయి వాల్యూ రోజు రోజుకు పడి పోతోంది. డాలర్ కు రూ. 80కి పడి పోయింది.
ఈ తరుణంలో కీలక వ్యాఖ్యలు చేశారు జై శంకర్. ఆయన ఏమన్నారంటే శ్రీలంక లాంటి సంక్షోభం భారత్ లో వచ్చేందుకు ఆస్కారం లేదన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ద్వీప దేశంలో నెలకొన్న సంఘటనలు, సంక్షోభం పక్కనే ఉన్న భారత్ దేశంలో ఉన్న వారిని ఆందోళనకు గురి చేయడం మామూలేనన్నారు. కానీ అన్నింటిని తట్టుకుని నిలబడగలిగే సత్తా భారత ప్రభుత్వానికి ఉందన్నారు.
ఈ సమావేశంలో పి. చిదంబరం, మాణికం ఠాగూర్ , ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పాల్గొన్నారు. డీఎంకేకు చెందిన టిఆర్ బాలు, ఎం.ఎం. అబ్దుల్లా పాల్గొన్నారు.
అన్నాడీఎంకే, టీఎంసీ, నేషనల్ కాన్ఫరెన్స్ , ఆప్ , టీఆర్ఎస్ , బీఎస్పీ , వైఎస్సార్ సీపీ , ఎండీఎంకే తరున ఎంపీలు పాల్గొన్నారు.
Also Read : గీత దాటిన ప్రైవేట్ ఛానళ్లపై నజర్