Rahul Shewale : రాహుల్ షెవాలే శివ‌ సేన ఫ్లోర్ లీడ‌ర్

గుర్తించిన లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా

Rahul Shewale : మ‌రాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివ‌సేన పార్టీ ఇవాళ త‌న వారితోనే పోటీ ప‌డుతుండ‌డం విచార‌క‌రం. ఆయ‌న త‌న‌యుడు పార్టీ చీఫ్‌, మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేపై తిరుగుబాటు జెండా ఎగుర వేశారు రెబ‌ల్స్ .

త‌మ‌దే అస‌లైన పార్టీ అంటూ ప్ర‌క‌టించారు ప్ర‌స్తుతం సీఎంగా కొలువు తీరిన ఏక్ నాథ్ షిండే. ఇదే విష‌యంలో కీల‌క తీర్పు ఇవ్వ‌నుంది సుప్రీంకోర్టు. ఈ త‌రుణంలో కీల‌క మార్పు చోటు చేసుకుంది.

19 మంది స‌భ్యులు క‌లిగి ఉన్నారు శివ‌సేన పార్టీకి సంబంధించి. 16 మంది లోక్ స‌భ‌లో ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌గా రాజ్య‌స‌భ‌లో ముగ్గురున్నారు. ఇక సీఎం షిండే త‌నయుడు శ్రీ‌కాంత్ షిండే కూడా ఎంపీగా ఉన్నారు.

ఆయ‌న‌తో పాటు ఎంపీలంతా త‌మ నాయ‌కుడిని గుర్తించాల‌ని కోరుతూ లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ మేర‌కు ప‌రిశీలించిన అనంత‌రం శివ‌సేన పార్టీకి చెందిన ఎంపీ రాహుల్ షెవాలేను లోక్ స‌భ‌లో శివ‌సేన పార్టీ నేత‌గా గుర్తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఓం బిర్లా.

ఇక నుంచి షెవాలే శివ‌సేన నేత‌గా స‌భాప‌తి గుర్తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఇక నుంచి రాహుల్ వ్య‌వ‌హ‌రిస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కు శివ‌సేన‌కు వినాయ‌క్ రౌత్ ఉన్నారు.

ఆయ‌న ప‌నితీరు ప‌ట్ల ఎంపీలు ఆగ్ర‌హంతో ఉన్నారు. అందుకే మార్పు కోసం కోరామ‌న్నారు ఎంపీలు. అయితే పార్టీకి సంబంధించి చీఫ్ విప్ అలాగే ఉంటార‌ని ఈ సంద‌ర్భంగా చెప్పారు రాహుల్ షెవాలే(Rahul Shewale).

ఏక్ నాథ్ షిండే వ‌ర్గాన్ని స‌మ‌ర్థిస్తున్న వారిలో శ్రీ‌కాంత్ షిండే, రాహుల్ షెవాలే, భావ‌నా గంగూలీ, హేమంత్ గాడ్సే, రాజేంద్ర‌గ‌విత్ , స‌దా శివ్ లోఖండే, హేమంత్ పాటిల్ , సంజ‌య్ మాండ్లిక్ , ధైర్య షీల్ మానే, శ్రీ‌రంగ్ బ‌ర్నే, కృపాల్ తుమానే, ప్ర‌తాప్ర‌వ్ జాద్ ఉన్నారు.

Also Read : లులు మాల్ లో ప్రార్థ‌న‌ల‌పై సీఎం క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!