Sanjay Raut : క‌ష్టాల్లో సైతం ఉద్ధ‌వ్ వెంటే సంజ‌య్ రౌత్

మ‌రాఠా రాజ‌కీయాల‌లో టార్చ్ బేర‌ర్

Sanjay Raut : శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. మాట‌లు తూటాల్లాగా ఉంటాయి. శివ‌సేన‌కు ఇప్పుడు ఆయ‌నే టార్చ్ బేర‌ర్. ఏ విష‌యంపైన నైనా అన‌ర్ఘ‌లంగా మాట్లాడే స‌త్తా ఉన్నోడు.

అంతే కాదు దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ , దాని అనుబంధ సంస్థ‌లు, ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ న‌డ్డాల‌పై నిప్పులు చెరుగుతూ వ‌స్తున్న ఏకైక నాయ‌కుడు సంజ‌య్ రౌత్(Sanjay Raut).

ఓ వైపు దూకుడుగా వ్య‌వ‌హ‌రించే సంజ‌య్ రౌత్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. క‌ష్ట కాలంలో న‌మ్మిన వాళ్లు, న‌మ్ముకున్న వాళ్లు తిరుగుబాటు జెండా ఎగుర వేస్తే సంజ‌య్ రౌత్ మాత్రం అడ్డు గోడ‌లా నిల‌బ‌డ్డాడు.

తాను ఒక్క‌డే పార్టీకి అన్నీ అయ్యాడు. రెబ‌ల్స్ విమ‌ర్శిస్తున్నా త‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు. ఇంకొక‌రైతే మౌనంగా ఉండ‌డ‌మో లేదా రాజీ ప‌డ‌డ‌మో చేసే వారు. కానీ ఈ ఎంపీ మాత్రం నేటికీ యుద్దం చేస్తూనే ఉన్నాడు.

తాజాగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ స‌మ‌న్లు జారీ చేసింది. వెంట‌నే రావాల్సిందిగా ఆదేశించింది. దీంతో తాను ఈడీకి స‌హ‌క‌రిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డిన‌ట్లు ఈడీ ఆరోప‌ణ‌లు చేసింది.

ఈ మేర‌కు ఆయ‌న కుటుంబానికి సంబంధించిన ఆస్తుల‌ను అటాచ్ చేసింది. ఈనెల లోనే సంజ‌య్ రౌత్ ను ఈడీ 10 గంట‌ల పాటు విచారించింది.

ఇవాళ ఈడీ హాజ‌ర‌య్యే కంటే ముందు ఉద్ద‌వ్ ఠాక్రే చేతిలో చేయి వేసుకుంటూ న‌వ్వుతూ వెళ్లి పోయారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

Also Read : సంజ‌య్ రౌత్ కు ఈడీ స‌మ‌న్లు జారీ

Leave A Reply

Your Email Id will not be published!