Paramhans Acharya : ఇండియాను హిందూ దేశంగా ప్ర‌క‌టించాలి

స‌ర‌యూ న‌దిలో జ‌ల స‌మాధి అవుతా

Paramhans Acharya : జ‌గ‌ద్గురువు ప‌ర‌మ‌హంస ఆచార్య సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. బుధ‌వారం ల‌క్నోలో హ‌ల్ చ‌ల్ చేశారు. అక్టోబ‌ర్ 2 నాటికి భార‌త దేశాన్ని హిందూ దేశంగా ప్ర‌క‌టించాల‌ని ప‌రమ‌హంస ఆచార్య(Paramhans Acharya) డిమాండ్ చేశారు.

లేక పోతే ఆందోళ‌న మ‌రింత ఉధృతం చేస్తాన‌ని హెచ్చ‌రించారు. అంతే కాదు తాను స‌ర‌యూ న‌దిలో జ‌ల స‌మాధి అవుతాన‌ని హెచ్చ‌రించారు. దీంతో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది అంత‌టా. భారీ ఎత్తున పోలీసులు చేరుకున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం స్పందించాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌న్నారు ప‌రమహంస ఆచార్య‌. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. ముస్లింలు, క్రైస్త‌వుల జాతీయ‌త లేకుండా చేయాల‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

భార‌త దేశాన్ని హిందూ దేశంగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేయ‌డం ఇదే మొద‌టిసారి కాదు. గ‌తంలో హిందూ దేశంగా ప్ర‌క‌టించాల‌ని కోరుతూ 15 రోజుల పాటు నిరాహార దీక్ష చేప‌ట్టారు ప‌ర‌మ‌హంస ఆచార్య‌(Paramhans Acharya).

ఆనాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా హామీ ఇవ్వ‌డంతో నిరాహార‌దీక్ష విర‌మించారు. త‌ప‌స్వి కంటోన్మెంట్ కు చెందిన ప‌రమ‌హంస ఆచార్య చేసిన డిమాండ్ కు మ‌ద్ద‌తుగా హిందూ స‌నాత‌న ధ‌ర్మ సంస‌ద్ ను నిర్వ‌హిస్తామ‌ని అయోధ్య లోని సంత్ సంఘ్ తెలిపింది.

గ‌తంలో ఒక‌సారి ద్వారకా శార‌దా పీఠం అధిప‌తి శంక‌రాచార్య స్వామి స్వ‌రూపానంద‌ను అయోధ్య‌లో రామ మందిరం భూమి పూజ‌కు సంబంధించిన ముహూర్తం గురించి స‌వాల్ చేశారు.

Also Read : లులు మాల్ లో ప్రార్థ‌న‌ల‌పై సీఎం క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!