Smriti Irani : రాహుల్ గాంధీ పై స్మృతీ ఇరానీ ఫైర్
ప్రశ్నించే దమ్ము లేదు అడ్డు తగిలితే ఎలా
Smriti Irani : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు బీజేపీ సంకీర్ణ సర్కార్ ను టార్గెట్ చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఈ దేశంలో ప్రభుత్వం అనేది ఒకటి ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం బుక్ లెట్ తీసుకు వచ్చారంటూ ప్రశ్నించారు. ప్రధాన మంత్రి జవాబు చెప్పకుండా ఉండి పోతే ఎలా అని నిలదీశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ(Smriti Irani) నిప్పులు చెరిగారు. ప్రశ్నించే దమ్ము లేనోడు, 40 శాతం కంటే తక్కువ హాజరు శాతం ఉన్న రాహుల్ గాంధీకి తమ పార్టీని, తమ నాయకుడిని అనే అర్హత లేదన్నారు.
దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపారు కాంగ్రెస్ పార్టీ సభ్యులు. బాధ్యతా రాహిత్యంతో ప్రభుత్వాన్ని నడుపుతున్న మోదీ(PM Modi), ఆయన పరివారానికి తమను అనే హక్కు లేదన్నారు.
దీంతో ఇరు పార్టీల మధ్య రాద్దాంతం చోటు చేసుకుంది. మూడో రోజు ధరల పెరుగుదల, ద్రోవ్యోల్బణం సమస్యలపై గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి నిరసన చేపట్టారు.
రెండు రోజుల పాటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఆహార పదార్థాలపై పెంచిన జీఎస్టీ , ద్రవ్యోల్బణం చర్చించేందుకు రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా నోటీసు ఇచ్చారు.
మరో వైపు స్మృతీ ఇరానీ(Smriti Irani) వ్యక్తిగత విమర్శలు చేయడం కలకలం రేపింది. పార్లమెంట్ లో చర్చ జరగకుండా ఉండేలా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.
Also Read : ఆర్థిక సంక్షోభంలో మయన్మార్