Mohammed Zubair : మ‌హ్మ‌ద్ జుబైర్ కు బెయిల్ మంజూరు

ఎట్ట‌కేల‌కు విడుద‌ల కానున్న ఫ్యాక్ట్ చెక‌ర్

Mohammed Zubair : మ‌త ప‌ర‌మైన భావ‌న‌లు రెచ్చ‌గొట్టాడ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఫ్యాక్ట్ చెక‌ర్, ఆల్ట్ న్యూస్ కో ఫౌండ‌ర్ మ‌హ్మ‌ద్ జుబైర్ కు ఎట్ట‌కేల‌కు ఊర‌ట ల‌భించింది.

ఆయ‌న‌పై న‌మోదైన అన్ని కేసుల నుంచి విముక్తి ల‌భించింది. ఈ మేర‌కు మ‌హ్మ‌ద్ జుబైర్(Mohammed Zubair) బెయిల్ మంజూరు చేసింది. యూపీ రాష్ట్రంలో న‌మోదైన కేసులు బ‌దిలీ చేయాల‌ని ధ‌ర్మాస‌నం ఆదేశించింది.

ఇదిలా ఉండ‌గ‌గా 2018లో జుబైర్ చేసిన ట్వీట్ అభ్యంత‌క‌రంగా ఉందంటూ ఆరోప‌ణ‌లు చేయ‌డంతో పోలీసులు జుబైర్ ను అదుపులోకి తీసుకున్నారు.

త‌న అరెస్ట్ అక్ర‌మ‌మ‌ని, తాను భార‌తీయుడిగా అభిప్రాయాల‌ను తెలియ చేశాన‌ని, ఇందులో ఎలాంటి దేశానికి సంబంధించిన వ్య‌తిరేక‌త ఎంత మాత్రం లేద‌ని స్ప‌ష్టం చేశారు కోర్టుకు.

ఇవాళ విచార‌ణ చేప‌ట్టిన కోర్టు సాయంత్రం 6 గంట‌ల లోపు జైలు నుంచి విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది. గ‌త నెల‌లో జుబైర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌డంతో క‌స్ట‌డీకి అనుమ‌తి ల‌భించింది.

ఇదిలా ఉండ‌గా జుబైర్ పై ఏకంగా ఏడు కేసులు న‌మోద‌య్యాయి. ఆ కేసుల‌న్నింటికీ ధ‌ర్మాస‌నం లైన్ క్లియ‌ర్ ఇచ్చింది. మొత్తం కేసుల్లో బెయిల్ మంజూరు కావ‌డంతో ఎట్టకేల‌కు మ‌హ్మ‌ద్ జుబైర్(Mohammed Zubair) కు ఊర‌ట ల‌భించిన‌ట్ల‌యింది.

మ‌ధ్యంత‌ర బెయిల్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది కోర్టు. అరెస్ట్ ల అధికారాన్ని పొదుపుగా ఉప‌యోగించాల‌ని సూచించింది.

జుబైర్ ను నిరంత‌ర నిర్బంధంలో ఉంచ‌డం , అంతులేని శిక్ష‌కు గురి చేయ‌డం చ‌ట్టం స‌మ‌ర్థించ‌ద‌ని పేర్కొంది ధ‌ర్మాస‌నం. అత‌డిని ట్వీట్లు చేయ‌కుండా ఆపాల‌ని యూపీ స‌ర్కార్ కోర్టును కోరింది.

Also Read : పంజాబ్ లో గ్యాంగ్ స్ట‌ర్లు ఎన్ కౌంట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!