Aaditya Thackeray : తాతకు వారసుడు అవుతాడా నాయకుడు
కొనసాగుతున్న ఫిరాయింపుల పర్వం
Aaditya Thackeray : మరాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన ఇప్పుడు తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు శివసేన అంటే హడల్. అంతకంటే బాలా సాహెబ్ ఏది చెబితే అదే వేదం..అదే చట్టం..అదే శాసనం..అదే రాజ్యాంగం.
కానీ రాను రాను తను కనుమరుగయ్యాక పరిస్థితి మారింది. మారుతున్న విపరీతమైన ధోరణులు సైతం శివసేన పార్టీలో చోటు చేసుకున్నాయి.
కేవలం హిందూత్వ ఎజెండాతోనే ప్రారంభమైన శివసేన ప్రస్థానం మెల మెల్లగా ప్రాభవం కోల్పోతోందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది.
ఒకప్పుడు బాలా సాహెబ్ ఏది చెబితే అదే నడిచింది. కానీ తనయుడు ఉద్ధవ్ ఠాక్రే తండ్రి వారసత్వం పుచ్చుకున్నా ఆయన ప్రదర్శించిన దూకుడు, దుందుడుకుతనం లేక పోవడం కూడా మైనస్ గా మారింది.
కుయుక్తులు, కుట్రలు, వెన్నుపోట్లు, ఆధిపత్య ధోరణులకు కేరాఫ్ గా మారాయి నేటి రాజకీయాలు. తాజాగా శివసేనలో చోటు చేసుకున్న పరిణామాలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.
బాలా సాహెబ్ శిష్యుడిగా పేరొందిన మాస్ లీడర్ ఏక్ నాథ్ షిండే ఉన్నట్టుండి శివసేన పార్టీలో తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఆపై భారతీయ
జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
శివసేన పార్టీపై గెలిచిన వారంతా గుడ్ బై చెప్పేశారు. ఏక్ నాథ్ షిండే వర్గం వైపు వెళ్లిపోయారు. దీంతో రోజు రోజుకు పార్టీపై పట్టు కోల్పోతున్నట్లు
అర్థం అవుతోంది.
ఈ తరుణంలో షిండే, ఉద్దవ్ ఠాక్రే ఇద్దరూ శివసేన పార్టీ తమదంటే తమదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆగస్టు 1 వరకు నిర్ణయాన్ని వాయిదా వేసింది.
దీంతో పార్టీని బలోపేతం చేయడం, తిరుగుబాటు చేయకుండా ఉండేలా చూసేందుకు శివసేన పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే తనయుడు ఆదిత్యా ఠాక్రే(Aaditya Thackeray) రంగంలోకి దిగాడు.
ఇప్పటికే మరాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఈ యువనేత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు ప్లాన్ చేశారు.
ఈ మేరకు మరింత జోష్ నింపాలన్నదే ఆయన ప్రయత్నం. ఏది ఏమైనా రాజకీయం అంటే మామూలు విషయం కాదన్నది తండ్రీ కొడుకులకు ఇప్పుడు తెలిసొచ్చింది.
Also Read : ఉద్దవ్ ఠాక్రేకు షాక్ షిండేకు ఊరట