Penny Mordaunt : అనూహ్యంగా పెన్నీ మోర్డాంట్ నిష్క్రమణ
బ్రిటన్ పీఎం రేసు నుంచి ఐదో రౌండ్ లో అవుట్
Penny Mordaunt : బ్రిటన్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇక రేసులో భారతీయ మూలాలు కలిగిన రిషి సునక్ , లిజ్ ట్రస్ , పెన్నీ మోర్డాంట్, తదితరులు ప్రధాన పోటీదారులుగా చివరి దాకా నిలిచారు.
మొత్తం పీఎం పదవి కోసం 11 మంది బరిలో నిలిచారు. మొత్తం ఐదు రౌండ్లకు గాను అన్ని రౌండ్లు ముగిశాయి. రిషి సునక్ మొదటి నుంచి చివరి రౌండ్ దాకా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు.
విచిత్రం ఏమిటంటే గట్టి పోటీ ఇస్తూ వచ్చిన పెన్నీ మోర్డాంట్(Penny Mordaunt) అనూహ్యంగా ఆఖరు రౌండ్ నుంచి తప్పుకోవడం విస్తు పోయేలా చేసింది రాజకీయ వర్గాలను. మోస్ట్ పాపులర్ పొలిటికల్ లీడర్ గా ఆమెకు పేరుంది.
ఐదో రౌండ్ లో రిషి సునక్ కు 137 ఓట్లు రాగా లిజ్ ట్రస్ కు 113 ఓట్లు వచ్చాయి. నాలుగు రౌండ్లలో లిజ్ ట్రస్ మూడో స్థానంలో ఉండగా చివరి
రౌండ్ లో రెండో ప్లేస్ దక్కించుకుంది. కేవలం 8 ఓట్ల తేడాతో పెన్నీ మోర్డాంట్ పోటీ నుంచి నిష్క్రమించింది.
ఏది ఏమైనా పెన్నీ పీఎం ఎన్నికల బరిలో పోటీ చేయడంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా ఎవరీ పెన్నీ అనేలా చేసుకున్నారు. అద్భుతమైన వాక్చాతుర్యం కలిగిన ఆమెకు అంతా పట్టం కడతారని అనుకున్నారు.
కానీ లిజ్ దెబ్బకు పెన్నీ వైదొలిగేలా చేసింది. వాణిజ్య విధాన మంత్రిగా ఉన్నారు. రక్షణ శాఖ కార్యదర్శిగా పని చేశారు. ఆమె పూర్తి పేరు
పెనెలోప్ మేరీ మోర్డాట్ . 4 మార్చి 1973లో పుట్టారు.
రాజకీయ వేత్తగా పేరొందారు. 2021 నుండి మంత్రిగా పని చేస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యురాలు. యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్ లో తత్వశాస్త్రం చదివారు. 2000, 2004లో జార్జ్ బుష్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి కూడా పని చేశారు పెన్నీ మోర్డాంట్(Penny Mordaunt).
సాయుధ దళాల సహాయ మంత్రిగా పని చేశారు. ఒక మహిళ ఆ పదవి చేపట్టడం మొదటిసారి. వికలాంగులు, ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.
ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ స్టేటస్ సెక్రటరీగా నియమితులయ్యారు. 2018 నుంచి 2019 దాకా మహిళలు, సమానత్వ శాఖ మంత్రిగా పని చేశారు.
Also Read : బ్రిటన్ పీఎం రేసులో నువ్వా నేనా