Sharad Pawar Dissolves : ఎన్సీపీలో అన్ని విభాగాలు రద్దు
శరద్ పవార్ సంచలన నిర్ణయం
Sharad Pawar Dissolves : మహారాష్ట్రలో రోజు రోజుకు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. శివసేన పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు పార్టీకి సంబంధించి అన్ని విభాగాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం శరద్ పవార్(Sharad Pawar) తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలో కలకలం రేపింది.
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో మహా వికాస్ అఘాడీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
అనుకోని రీతిలో రెండున్నర ఏళ్ల తర్వాత శివసేన పార్టీలో తిరుగుబాటు ప్రకటించారు మంత్రిగా ఉన్న ఏక్ నాథ్ షిండే(Eknath Shinde). ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తో మరాఠా సీఎంగా కొలువు తీరారు.
తాజాగా అన్ని విభాగాలకు సంబంధించిన కార్యవర్గాలను పూర్తిగా రద్దు చేసినట్లు ఎన్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రపుల్ పటేల్ వెల్లడించారు.
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ముందు చూపుతో పార్టీలోని అన్ని వర్గాలు, విభాగాలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్ప కూలి పోయిన మూడు వారాల (21 రోజులు ) తర్వాత ఆకస్మిక నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాలను ఇంత వరకు స్పష్టం చేయలేదు ప్రపుల్ పటేల్.
ఇదిలా ఉండగా తనపై ఎవరూ కూడా తిరుగుబాటు జెండా ఎగుర వేయకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా అన్ని విభాగాలను రద్దు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పవార్(Sharad Pawar) తీసుకున్న నిర్ణయం చర్చకు దారి తీసింది.
Also Read : ఢిల్లీ ఆస్పత్రిలో చేరిన భగవంత్ మాన్