Microsoft Teams Down : మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365లో అంతరాయం
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు
Microsoft Teams Down : ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీగా పేరొందిన మైక్రో సాఫ్ట్ తయారు చేసిన ఆఫీస్ 365 లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీలన్నీ మైక్రో సాఫ్ట్ ఆఫీస్ 365ని విధిగా వాడుతున్నాయి.
వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది ఈ సాఫ్ట్ వేర్ నే ఎక్కువగా వినియోగిస్తారు. వేలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
మైక్రో సాఫ్ట్ టీమ్(Microsoft Teams Down) లను యాక్సెస్ చేయలేక పోయిన లేదా యాప్ లో ఏదైనా ఫీచర్ లను ఉపయోగించ లేక పోయిన అంతరాయాన్ని పరిశీలిస్తున్నట్లు మైక్రో సాఫ్ట్ కార్ప్ వెల్లడించింది.
ఎంత మంది టీమ్ ల వినియోగదారులు ప్రభావితం అయ్యారనే దానిపై మైక్రో సాఫ్ట్ సంస్థ వివరాలను వెల్లడించ లేదు. దీనిపై ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ సమస్య నెలకొందనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వక పోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి.
ఒక్క రోజే 10 గంటలకు మైక్రో సాఫ్ట్ టీమ్ లతో సమస్యలను నివేదించిన వ్యక్తులు 4, 800 మంది కంటే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. డౌన్ డిటెక్టర్. కామ్ ప్రకారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఏది తయారు చేయాలన్నా ముందు కావాల్సింది మైక్రో సాఫ్ట్ ఆఫీస్ 365. ప్రతి ఒక్కరు దీనిని వాడేందుకు ఎక్కువగా ఇష్ట పడతారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమేనంటూ సదరు వెబ్ మానిటరింగ్ సంస్థ తెలిపింది.
ఇదిలా ఉండగా మిగతా టెక్నాలజీ కంపెనీలు సైతం గత ఏడాదిలో అంతరాయాలతో దెబ్బతిన్నాయి.
Also Read : భవిష్యత్తు వర్చువల్ టెక్నాలజీదే