Lal Singh Chaddha : ఆకట్టుకుంటున్న నాగచైతన్య పోస్టర్
లాల్ సింగ్ ఛద్దా మూవీ ఫస్ట్ లుక్
Lal Singh Chaddha : సమంతతో విడి పోయాక నాగ చైతన్య ఫుల్ బిజీగా మారారు. మరో వైపు సమంత రుత్ ప్రభు కూడా చైతన్య కంటే ఎక్కువ సినిమాల్లో నటిస్తోంది. ఇక వరుస సినిమాలతో అలరిస్తూ వస్తున్నారు చైతన్య.
ఇప్పటికే సాయి పల్లవితో లవ్ స్టోరీ సక్సెస్ అయ్యింది. ఇక బంగార్రాజు మూవీ అలరించింది. కృతి శెట్టి తో పోటీ పడి నటించాడు. ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తీసిన థాంక్యూ త్వరలో రిలీజ్ కానుంది.
ఇదే సమయంలో ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్ధా మూవీ విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.
ఇందులో అమీర్ ఖాన్ తో పాటు నాగ చైతన్య కూడా నటించారు. చిత్రంలో నాగ చైతన్య(NagaChaitanya) బాలారాజు పాత్రలో నటించాడు. దక్షిణాదికి చెందిన ఆర్మీ ఆఫీసర్ ఇందులో పాత్ర. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి ఆదరణ లభిస్తోంది.
కాస్తంత కామెడీతో పాటు డ్రామా మేళవించిన ఈ మూవీ వచ్చే ఆగస్టు 11న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ తెగ ప్రయత్నం చేస్తోంది.
విశేషం ఏమిటంటే ఈ లాల్ సింగ్ చద్దా(Lal Singh Chaddha) మూవీని సమర్పిస్తున్నారు చిరంజీవి. గతంలో ఆయన రుద్ర వీణ, త్రినేత్రుడు చిత్రాలను సమర్పించారు.
మానాడు ఫేం వెంకట్ ప్రభుత దర్శకత్వంలో యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.
Also Read : సమంత అక్షయ్ డ్యాన్స్ అదుర్స్