Liger Trailer : లైగర్ ట్రైలర్ నెట్టింట్లో హల్ చల్
విజయ్ దేవరకొండ నటన సూపర్
Liger Trailer : డైనమిక్ డైరెక్టర్ గా పేరొందిన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరోగా పేరొందిన విజయ్ దేవరకొండ , అనన్య పాండే కలిసి నటించిన లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్ ) మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఊహించచని రీతిలో సినిమాను తెర కెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. గురువారం మూవీ మేకర్స్ లైగర్ మూవీకి సంబంధించిన ట్రైలర్(Liger Trailer) విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి భారీ ఎత్తున స్పందన వస్తోంది.
ఈ చిత్రం ప్రకటించిన నాటి నుంచి నేటి దాకా రోజు రోజుకు ఉత్కంఠ రేపుతోంది. ఇక ఇస్మార్ట్ శంకర్ , పోకిరి వంటి సినిమాలను రూపొందించిన పూరీ జగన్నాథ్ ఈ సినిమాను మరింత ఛాలెంజ్ గా తీసుకున్నాడు.
సినిమాను వచ్చే ఆగస్టు 25న విడుదల చేయనున్నారు. కిక్ బాక్సర్ గా ఇందులో కనిపిస్తాడు విజయ్ దేవరకొండ. అనన్య పాండే విజయ్ కి ప్రేమికురాలిగా నటిస్తోంది. రమ్య కృష్ణ ఈ చిత్రంలో రౌడీ బాయ్ కి తల్గిగా నటించింది.
మైక్ టైసన్ ప్రతికూల పాత్రలో ఉంటాడని తెలుస్తోంది. ఆయన గతంలో ది హ్యాంగోవర్ ఫిల్మ్ సీరీస్ లో నటించాడు. ఇక విజయ్ దేవర కొండ కు భారీ కటౌట్లు పెడుతున్నారు ఫ్యాన్స్ .
ఈ చిత్రం గురించి కరణ్ జోహార్ ఇలా రాశాడు. ఆల్ అవుట్ యాక్షన్ , ధమాకా, వినోదం అందించేందుకు రెడీగా ఉంది లైగర్. మరి మీరు రెడీగా ఉన్నారా అని పేర్కొన్నాడు. లైగర్ సినిమాకు సంబంధించి ఇటీవల అక్డీ పక్డీ సాంగ్ విడుదలైంది. మంచి ఆదరణ లభిస్తోంది.
Also Read : ఆకట్టుకుంటున్న నాగచైతన్య పోస్టర్