Ramdas Athawale : శివసేనను విడదీసిన సంజయ్ రౌత్
రాందాస్ అథవాలే సంచలన కామెంట్స్
Ramdas Athawale : కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే సంచలన కామెంట్స్ చేశారు. శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
సంజయ్ రౌత్ కావాలనే శివసేన పార్టీని విచ్ఛిన్నం చేశారంటూ మండిపడ్డారు. శివసేన, ఎన్సీపీ కలిసి ఉండక పోతే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన ప్రభుత్వం వచ్చి ఉండేదన్నారు కేంద్ర మంత్రి.
శివసేనను విచ్ఛిన్నం చేసింది శరద్ పవార్ కాదని సంజయ్ రౌత్ అని స్పష్టం చేశారు. సంజయ్ రౌత్ కోరిక మేరకు ఉద్దవ్ ఠాక్రే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో వెళ్లాలని నిర్ణయించుకున్నారంటూ ఆరోపించారు.
శివసేన, ఎన్సీపీ కలిసి ఉండక పోతే మహా వికాస్ అఘాడీ ఎప్పటికీ ఏర్పడి ఉండేది కాదన్నారు. అందువల్లనే మరాఠాలో బీజేపీ, శివసేన ప్రభుత్వం వచ్చి ఉండేదని పేర్కొన్నారు.
అంతకు ముందు మహారాష్ట్ర మాజీ మంత్రి రాం దాస్ కదమ్ , ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శివసేనను చీల్చారంటూ ఆరోపించారు రాందాస్ అథవాలే(Ramdas Athawale).
చాలా ప్రీ ప్లాన్ గా శరద్ పవార్ క్రమ పద్దతిలో బలహీన పర్చేలా చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివసేన చీఫ్ కుమారుడు ఎన్సీపీ, కాంగ్రెస్ మంత్రులతో కూర్చోవడం మాలో ఎవరికీ ఆమోద యోగ్యం కాదన్నారు.
ఏక్ నాథ్ షిండే గనుక ఈ చర్య తీసుకోక పోతే శివసేనకు 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండే వారు కాదని ఎద్దేవా చేశారు.
Also Read : ఎన్సీపీలో అన్ని విభాగాలు రద్దు