HCA IND vs AUS T20 : హైద‌రాబాద్ కు బీసీసీఐ గుడ్ న్యూస్

రాజీవ్ స్టేడియంలో భార‌త్..ఆసిస్ టి20

HCA IND vs AUS T20 : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ అంటేనే చాలా మంది భ‌య‌ప‌డుతున్న వేళ ఎట్ట‌కేల‌కు మ్యాచ్ నిర్వ‌హించేందుకు ఓకే చెప్పింది.

హెచ్ సిఏ ప్రెసిడెంట్ గా భార‌త జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాలు న‌మోదు చేసిన హైద‌రాబాద్ స్టార్ ప్లేయర్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ ఉన్నా ఫ‌లితం లేకుండా పోయింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

హెచ్ సీ ఏలో చోటు చేసుకున్న అవినీతి, ఆరోప‌ణ‌లు స‌భ్యుల మ‌ధ్య మ‌రింత అగాధాన్ని పెంచాయి చివ‌ర‌కు కోర్టు మెట్లు ఎక్కారు. అజ‌హ‌రుద్దీన్ ఓ నియంత అని ఆయ‌న వ‌ల్ల హైద‌రాబాద్ లో క్రికెట్ కు ఆద‌ర‌ణ లేకుండా పోయింద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా తాజాగా బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆస్ట్రేలియా జ‌ట్టు మూడు టి20 మ్యాచ్(HCA IND vs AUS 3rd T20) లు ఆడుతుంది. ద‌క్షిణాఫ్రికా టీంతో 3 టి20లు, 3 వ‌న్డేలు ఆడుతుంది.

దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ ఖ‌రారు చేసింది. చాలా కాలం త‌ర్వాత హైద‌రాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంకు మ్యాచ్ నిర్వ‌హ‌ణ చేప‌ట్టే అవ‌కాశం ల‌భించింది.

ఇదిలా ఉండ‌గా భార‌త్ , ఆస్ట్రేలియా మ‌ధ్య మూడో టి20 సెప్టెంబ‌ర్ 25న జ‌రుగుతుంది. 2019 డిసెంబ‌ర్ 6న ఇక్క‌డ భార‌త్, విండీస్ తో మ్యాచ్ జ‌రిగింది. ఆనాటి నుంచి నేటి వ‌ర‌కు ఒక్క మ్యాచ్ కూడా జ‌ర‌గ‌క పోవ‌డం విశేషం.

కాగా ఐపీఎల్ మ్యాచ్ ల‌కు హైద‌రాబాద్ ను ఎంపిక చేయ‌క పోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు మంత్రి కేటీఆర్. దీనిపై హెచ్ సీ ఏ చీఫ్ గా ఉన్న అజ‌హ‌రుద్దీన్ నోరు మెద‌ప‌క పోవ‌డంపై తాజా, మాజీలు త‌ప్పు ప‌డుతున్నారు.

Also Read : లంక‌లో కాదు యూఏఈలో ఆసియా క‌ప్

Leave A Reply

Your Email Id will not be published!