Heavy Rains IMD : భారీ వర్షం అతలాకుతలం
హెచ్చరించిన వాతావరణ శాఖ
Heavy Rains IMD : తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర, దక్షిణ తెలంగాణలో పెద్ద ఎత్తున ఎడ తెరిపి లేకుండా వర్షాలు(Heavy Rains IMD) కురుస్తున్నాయి.
ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మరికొన్ని గంటల్లో పెద్ద ఎత్తున కురిసే చాన్స్ ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాల వాసులను అప్రమత్తం చేసింది సర్కార్.
ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు ఎక్కడ చూసినా నీళ్లతో నిండి పోయాయి రహదారులు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి పోయాయి. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఏకధాటిగా కురుస్తున్న వర్షపు ధాటికి హైదరాబాద్ లో మోకాళ్ల లోతు నీళ్లు వచ్చాయి. ఎల్బీ నగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ , శేరి లింగంపల్లిలో 8 సెం. మీ వర్షపాతం నమోదైంది. కూకట్ పల్లి, బాలాజీ నగర్ , బాలా నగర్ ప్రాంతాలలో 7 సెం. మీ వర్షపాతం కురిసింది.
మాదాపూర్ , మచ్చ బొల్లారం, జగద్గిరిగుట్ట, మియా పూర్ , ఆర్సీ పురం, రంగారెడ్డి నగర్ లో 6 సెం. మీ వర్షపాతం నమోదైంది. ఇక ఫతేనగర్ , మౌలాలీ, హెచ్ సీయూ, మోతీ నగర్ లలో 5 సెం. మీ వర్షపాతం కురిసింది.
పరిస్థితి విషమించకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. ఎవరూ అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కోరింది.
Also Read : సూరరై పొట్రుకు అవార్డుల పంట