CEC – Uddhav & Shinde : ఈసీకి చేరిన శివసేన పంచాయతీ
మెజారిటీ ఉన్నట్టు పత్రాలు సమర్పించండి
CEC – Uddhav & Shinde : మహారాష్ట్రలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. శివసేన పార్టీ తమదంటే తమదని మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, సీఎం ఏక్ నాథ్ షిండే చెబుతున్నారు.
ఈ తరుణంలో ఉద్దవ్ ఠాక్రే శివసేన పార్టీ గుర్తును ఎవరూ వాడు కోరాదని, బాలా సాహెబ్ పేరును ఎవరూ ఉపయోగించ రాదంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.
దీంతో శివసేన తిరుగుబాటు నేత సీఎం ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) తమదే అసలైన శివసేన పార్టీ అంటూ ఈసీకి(CEC) విన్నవించారు. దీంతో ఉద్దవ్ ఠాక్రే,(Uddhav Thackray) ఏక్ నాథ్ షిండేలకు మెజారిటీని నిరూపించు కునేందుకు కావాల్సిన పత్రాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఆదేశించింది.
ఆగస్టు 8వ తేదీ లోగా పత్రాలు సమర్పించాలని ఇరు పక్షాలను కోరింది. వాటిపై రాజ్యాంగ సంస్థ ఈ అంశాన్ని విచారిస్తుందని తెలిపింది. శివసేనపై నియంత్రణ కోసం ఇరువురు పోటీ పడుతున్నారు.
ఈ తరుణంలో పార్టీని ఎవరు నడిపిస్తారో నిరూపించేందుకు ఇద్దరూ డాక్యుమెంట్లు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
40 మంది శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో తిరుగుబాటు ప్రకటించారు ఏక్ నాథ్ షిండే. భారతీయ జనతా పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా 55 మంది ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎంపీలలో 12 మంది తమకు మద్దతుగా ఉన్నారంటూ ఏక్ నాథ్ షిండే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
దీంతో ఆగస్టు 8 తర్వాత ఎవరిది శివసేన పార్టీ అనేది తేలుతుంది. శివసేన పంచాయతీ ఇప్పుడు ఈసీ చేతుల్లో ఉంది.
Also Read : అసోం కళాకారుడి ప్రతిభకు మోదీ ఫిదా