Munugodu MLA : బీజేపీ వైపు మునుగోడు ఎమ్మెల్యే చూపు

బుజ్జ‌గిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం

Munugodu MLA : కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్ర‌ద‌ర్స్ బ‌ల‌మైన నాయ‌కులుగా ముద్ర ప‌డ్డారు. ఒక‌రు ఎమ్మెల్యేగా ఉంటే ఇంకొక‌రు ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో వీరికి మంచి ప‌ట్టుంది.

తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఎమ్మెల్యేగా ఉన్న కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి(Munugodu MLA)  ఉన్న‌ట్టుండి కాషాయం వైపు చూస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆయ‌న కొంత కాలం నుంచీ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఆ వెంట‌నే పార్టీ కార్య‌క‌ర్త‌లు, అనుచ‌రుల‌తో స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ పార్టీలో క‌ద‌లిక‌లు వ‌చ్చాయి. పార్టీ ఇప్పుడిప్పుడే బ‌లం పుంజుకునే దిశ‌గా క‌దులుతోంది. ఈ త‌రుణంలో అన్న‌ద‌మ్ముల్లో ఒక‌రు ఇత‌ర పార్టీ వైపు చూడ‌డం బిగ్ షాక్ అనే చెప్ప‌క త‌ప్ప‌దు పార్టీకి.

బీజేపీలోకి వెళ్ల‌డం ఖాయ‌మ‌ని తానే సీఎం అభ్య‌ర్థినంటూ చెప్పిన ఆడియో అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది. గ‌తంలో కాంగ్రెస్ ను వీడొద్దంటూ నాయ‌కులు, అభిమానులు చెప్ప‌డంతో మిన్న‌కుండి పోయారు.

పార్టీకి సంబంధించిన కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఇదిలా ఉండ‌గా కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

కేసీఆర్ ను ఢీకొనే స‌త్తా కాంగ్రెస్ కు లేద‌ని ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకే ఆ అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌న్నారు. ఇది పార్టీలో క‌ల‌క‌లం రేపింది.

కాగా త‌న సోద‌రుడు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాత్రం తాను చ‌ని పోయేంత దాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : జోరు వాన త‌డిసి ముద్దైన తెలంగాణ

Leave A Reply

Your Email Id will not be published!